Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్ చిత్రం విడుదల 2 ఫస్ట్ లుక్

డీవీ
బుధవారం, 17 జులై 2024 (15:33 IST)
Vidudala 2 first look
దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన "విడుదల పార్ట్ 1" థియేట్రికల్ గా ఘన విజయం సాధించినప్పటి నుంచి సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. "విడుదల 2" సినిమా రిలీజ్ కోసం సినీ ప్రియులు, ట్రేడ్ వర్గాలు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన విడుదల 2 ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. తెలుగు తమిళంలో "విడుదల 2" ఫస్ట్ లుక్ రిలీజైంది. 
 
ఈ సందర్భంగా నిర్మాత ఎల్రెడ్ కుమార్ మాట్లాడుతూ - విడుదల పార్ట్ 1 సినిమాకు మూవీ లవర్స్ నుంచి వచ్చిన హ్యూజ్ రెస్పాన్స్ మా టీమ్ అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది. విడుదల పార్ట్ 1 మూవీ అంచనాలు మించి విజయం సాధించింది. కమర్షియల్ అంశాలతో పాటు రియలిస్టిక్ అప్రోచ్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈతరం దర్శకులకు స్ఫూర్తినిచ్చింది. యాక్టర్ సూరికి విడుదల పార్ట్ 1 మూవీ సక్సెస్ ఎంతో పేరు తెచ్చింది. విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ హిట్ మహారాజ తర్వాత వస్తున్న చిత్రంగా విడుదల 2పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా విడుదల 2 సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. 
 
దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాను తనదైన శైలిలో తీర్చిదిద్దుతున్నారు. స్వరజ్ఞాని ఇళయరాజా సంగీతం విడుదల 2 మూవీకి మరో ఆకర్షణ కానుంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న విడుదల 2 సినిమాను ఈ ఏడాది చివరలో థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. భవానీశ్రీ, రాజీవ్ మీనన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేతన్, మంజు వారియర్, అనురాగ్ కశ్యప్ లాంటి ప్రతిభావంతమైన నటీనటులు విడుదల 2లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్, ఆడియో , థియేట్రికల్ రిలీజ్ డేట్స్ ను త్వరలో అనౌన్స్ చేస్తాం. అన్నారు.
 
నటీనటులు - విజయ్ సేతుపతి, సూరి, భవానీ శ్రీ, రాజీవ్ మీనన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేతన్, మంజు వారియర్, అనురాగ్ కశ్యప్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments