Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీర్ సైడ్ అయ్యాడు... కార‌ణం.. భ‌య‌మా? భ‌క్తా..?

సమ్మోహనంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (19:06 IST)
సమ్మోహనంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉండటం… హీరోహీరోయిన్ పెర్ఫార్మెన్స్ ఫ్రెష్‌గా అనిపించడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఆఫీస్ మొత్తం భయ‌ప‌డే సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజ‌ర్‌గా సుధీర్‌బాబు న‌టించ‌గా..  అల్ల‌రి చేసే గ‌డుస‌మ్మాయి సిరి పాత్ర‌లో హీరోయిన్ న‌భా న‌టేశ్ క‌నిపించింది.  
 
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 13న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు కొన్ని నెల‌ల క్రిత‌మే ప్ర‌క‌టించాడు. కానీ.. ఇప్పుడు అనుకోకుండా ఆ డేట్‌కి నాగ‌చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు, స‌మంత యు ట‌ర్న్ చిత్రాలు రిలీజ్ అవుతుండ‌టంతో సుధీర్ బాబు న‌న్ను దోచుకుందువ‌టే చిత్రం వాయిదా ప‌డుతుంది అని ప్ర‌చారం జ‌రిగింది.
 
కానీ... ఆయ‌న డేట్ ఛేంజ్ చేసే ఛాన్స్ లేద‌న్నాడు. కానీ... ఆఖ‌రికి త‌న సినిమాని ఈ నెల 21కి వాయిదా వేసాడు. దీంతో చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు సినిమా చూసి భ‌య‌ప‌డ్డాడా..? లేక చైతు అంటే భ‌క్తి అదేనండి.. అభిమానంతో పోటీప‌డ‌టం క‌రెక్ట్ కాద‌ని వాయిదా వేసాడా అనేది చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. అయితే.. చైతుతో ఉన్న ఫ్రెండ్‌షిప్ వ‌ల్ల పోటీప‌డ‌టం క‌రెక్ట్ కాద‌ని వాయిదా వేసాడ‌ని టాక్ వినిపిస్తోంది. అదీ సంగ‌తి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరే... పేర్ని నాని నీ బ్యాటరీ సరిగ్గా లేదు... పవన్ మంచోడు కాబట్టే.. : జేసీ ప్రభాకర్ రెడ్డి (Video)

తూగోలో రేవ్ కలకలం... ఐదుగురు అమ్మాయిలతో 14 మంది పురుషుల పార్టీ!!

Hyderabad: ప్రేమలో మునిగి తేలుతున్నారు.. వాటిని ఆర్డర్ చేశారు..

హమాస్ కమాండ్ కంట్రోల్‌ ఆస్పత్రిలో దాడి.. 43 మంది మృతి

ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మృతి.. పవన్ కల్యాణ్ ఆదేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments