Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''సమ్మోహనం'' షూటింగ్ జరిగేటప్పుడే శ్రీరెడ్డి వ్యవహారం..? మోహనకృష్ణ

సమ్మోహనం సినిమాపై ప్రస్తుతం సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ సినిమాలో చిత్రపరిశ్రమకు సంబంధించిన అంశాలున్నాయి. సమ్మోహనం చిత్రంలో సినీ పరిశ్రమను చెడుగా చూపించినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై ఆ చిత్ర ద‌

Advertiesment
''సమ్మోహనం'' షూటింగ్ జరిగేటప్పుడే శ్రీరెడ్డి వ్యవహారం..? మోహనకృష్ణ
, మంగళవారం, 12 జూన్ 2018 (14:41 IST)
సమ్మోహనం సినిమాపై ప్రస్తుతం సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ సినిమాలో చిత్రపరిశ్రమకు సంబంధించిన అంశాలున్నాయి. సమ్మోహనం చిత్రంలో సినీ పరిశ్రమను చెడుగా చూపించినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై ఆ చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మాట్లాడుతూ.. తనకు తిండి పెట్టే సినీ పరిశ్రమను చెడుగా ఎలా చూపిస్తానన్నారు. సమ్మోహనం చిత్రంలో పరిశ్రమను చెడుగా చూపించలేదు. మంచి చెడులను చర్చించామని తెలిపారు. 
 
ఉన్నత విద్యను అభ్యసించి చెండాలమైన సినీ పరిశ్రమలో ఎలా ఉంటున్నారని చాలామంది అడుగుతున్నారు. సినిమా పరిశ్రమ అంటే చాలామందికి చెడు అభిప్రాయం ఉంది. హీరోయిన్లపై ఒక రకమైన చులకనభావం ఏర్పడింది. తన వద్ద అసిస్టెంట్ డైరక్టర్లకు పిల్లనిచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రావట్లేదు. సినిమా కోసం ఆఫీసుల్ని కూడా రెంట్‌కు ఇవ్వరన్నారు. 
 
సమ్మోహనం సినిమా షూట్ చేసేటప్పుడే శ్రీరెడ్డి వ్యవహారం మీడియాలో వెలుగు చూసింది. కానీ తాను అలాంటి సన్నివేశాలు ఏడాదికి ముందే సీన్లు రాసుకున్నామని... ట్రైలర్లు కట్ చేసే ముందు శ్రీరెడ్డిని చూసే సీన్లు పెట్టామనుకొంటారు. వాటిని తొలగిద్దామా అని కొందరన్నప్పటికీ, అవి ప్లస్ అవుతాయని వాటిని తొలగించవద్దన్నాను. 
 
సమ్మోహనం సినిమా డబ్బింగ్ జరుగుతున్న సమయంలోనే హరితేజకు ఓ చేదు సంఘటన ఎదురైంది. థియేటర్లలో తనకు ఎదురైన అనుభవాన్ని చెబుతూ హరితేజ వీడియో పెట్టారు. సరిగ్గా మా కథకు సంబంధం ఉన్న సన్నివేశాలే బయట జరగడం యాదృచ్చికంగా జరిగింది.

అలాగే శ్రీరెడ్డి లేవనెత్తిన విషయాలు కొన్ని వాస్తవాలే. కానీ వాటిపై చర్చ పరిధి దాటింది. అలాంటి విషయాలను సంస్కారవంతంగా ఎలా చెప్పవచ్చో చూపించానని.. ఎక్కడా సినీ పరిశ్రమను తూలనాడలేదని చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రణ్‌బీర్‌తో అలియా ప్రేమలో పడిందా.. అయితే ఆమెనే అడగండి..