క్యాస్టింగ్‌ కౌచ్‌ నూటికి నూరుపాళ్ళూ జరుగుతోంది : అదితి రావు హైదరీ

తెలుగు మూలాలున్న హైదరాబాదీ. తొలిసారి నటించింది. మోహన్ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపుదిద్దుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం "సమ్మోహనం". ఈ చిత్రంలో హీరోయిన్‌గా అదితి రావు నటించింది.

ఆదివారం, 10 జూన్ 2018 (14:44 IST)
తెలుగు మూలాలున్న హైదరాబాదీ. తొలిసారి నటించింది. మోహన్ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపుదిద్దుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం "సమ్మోహనం". ఈ చిత్రంలో హీరోయిన్‌గా అదితి రావు నటించింది. ఈమె తొలి చిత్రం శృంగారం. ఆ తర్వాత బాలీవుడ్‌లో 'భూమి', 'చెలియా', 'పద్మావత్' వంటి చిత్రాల్లో నటించింది. తాజాగా "సమ్మోహనం" చిత్రం తర్వాత తెలుగు తెరకు పరిచయమవుతోంది.
 
తెలుగు ఇండస్ట్రీ గురించి, క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందిస్తూ, క్యాస్టింగ్‌ కౌచ్‌ నూటికి నూరుపాళ్ళూ జరుగుతోంది. అయితే ఒక్క సినీపరిశ్రమలోనే కాదు. అన్నిచోట్లా జరుగుతోంది. అయితే, మనమేంటో తెలిశాక అవతలివాళ్ళు కూడా వేరే దురుద్దేశాలతో మనల్ని అప్రోచ్‌ అయ్యే అవకాశం ఉండదు. నా సంగతే తీసుకుంటే, ఏడేళ్ళుగా ఉన్నా... గత మూడేళ్ళుగానే మంచి సినిమాలు, పాత్రలు వస్తున్నాయి. దృఢంగా ఉంటే అందరూ మనల్ని గౌరవిస్తారు. ప్రతిభను చూసి పిలుస్తారు. సమయం పట్టినా పైకి వస్తాం అని చెప్పుకొచ్చింది. 
 
అదేసమయంలో తాను గొప్ప దర్శకులతో, మంచి యాక్టర్స్‌తో వర్క్‌ చేశా. నాకెప్పుడూ ఎలాంటి ఇబ్బందీ వాళ్ళు కలగనివ్వలేదు. కానీ చాలామందితో పనిచేయలేదు. నా నటనకు పేరు వచ్చినంతగా నాకు అవకాశాలూ రాలేదు. ఫలానావాళ్ళతో ఎందుకు వర్క్‌ చేయలేదు అని చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళు నాతో ఎందుకు పనిచేయలేదో నాకెలా తెలుస్తుంది! నా టాలెంట్‌ కోసం పిలిచినవాళ్లతోనే ఇన్నాళ్ళూ వర్క్‌ చేశాను అని నిర్మొహమాటంగా చెప్పింది అదితి రావు హైదరీ. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పెళ్లయితే ఛాన్సిలివ్వరా.. ఎవరు చెప్పారు : కరీనా కపూర్