Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంట్ర‌స్టింగ్ ఉన్న 'న‌న్ను దోచుకుందువ‌టే' టీజ‌ర్..(Video)

స‌మ్మోహ‌నం సినిమాతో సూప‌ర్ స‌క్స‌స్ సాధించిన సుధీర్ బాబు న‌న్ను దోచుకుందువ‌టే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పైన సుధీర్ బాబు నిర్మిస్తున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించి

Advertiesment
ఇంట్ర‌స్టింగ్ ఉన్న 'న‌న్ను దోచుకుందువ‌టే' టీజ‌ర్..(Video)
, శనివారం, 14 జులై 2018 (20:18 IST)
స‌మ్మోహ‌నం సినిమాతో సూప‌ర్ స‌క్స‌స్ సాధించిన సుధీర్ బాబు న‌న్ను దోచుకుందువ‌టే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పైన సుధీర్ బాబు నిర్మిస్తున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన గులేబకావళి కథ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ పల్లవినే టైటిల్‌గా ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాకు ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
ఈ చిత్ర టీజర్‌ను ట్విట్ట‌ర్ ద్వారా సుధీర్ బాబు రిలీజ్ చేసారు. ఇక టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే... ఆఫీసుకి రావాలంటే ప్రతిరోజూ భయంతో చచ్చిపోతున్నాం సార్. మరీ దారుణంగా సెక్యూరిటీతో గెంటించేస్తున్నారు.. అనే డైలాగ్స్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. టీజర్ స్టార్టింగ్‌లోనే సుధీర్‌బాబు క్యారెక్టర్‌ని రివీల్ చేసారు. 
 
ఇంతకుముందున్న సుధీర్ బాబు సినిమాలకు, ఈ సినిమాకు ఏమాత్రం పొంతన లేదు. సీరియస్ యాక్షన్‌తో సుధీర్‌బాబు కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. హీరోయిన్ నభా కూడా ఓ క్రేజీ గర్ల్‌లా తన నటనతో ఆకట్టుకుంది. టోట‌ల్‌గా ఈ టీజ‌ర్ గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే.. చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంది. మ‌రి.. స‌మ్మోహ‌నం వ‌లే సుధీర్ బాబు న‌న్ను దోచుకుందువ‌టే‌తో కూడా స‌క్స‌ెస్ సాధిస్తాడని ఆశిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైతు, స‌మంత ప్ర‌య‌త్నం ఫ‌లించేనా..?