Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సూపర్‌స్టార్ కృష్ణ బర్త్‌డే.. "సమ్మోహనం" పరుస్తున్న ట్రైలర్

సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న "సమ్మోహనం" మూవీ ట్రైలర్‌ను గురువారం ట్విట్టర్ ద్వారా హీరో సుధీర్ రిలీజ్ చేశాడు. ఈ చిత్రానికి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తుండగా, అదితీరావు హీరోయిన్‌గా నటిస్తుంది.

Advertiesment
Sammohanam Theatrical Trailer
, గురువారం, 31 మే 2018 (11:11 IST)
సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు వేడుకల సందర్భంగా సమ్మోహనం సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. నిజానికి సూపర్ స్టార్ బర్త్‌డే రోజు మహేష్ బాబు చిత్రాలకు సంబంధించి ట్రైలర్ లేదా టీజర్ లేదా ఫస్ట్‌లుక్‌లను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈ యేడాది ప్రిన్స్ చిత్రాలు ఏవీ లేకపోవడంతో ఇపుడు ఘట్టమనేని ఫ్యామిలీకి చెందిన సుధీర్ బాబు చిత్ర ట్రైలర్‌ను సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు.
 
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న "సమ్మోహనం" మూవీ ట్రైలర్‌ను గురువారం ట్విట్టర్ ద్వారా హీరో సుధీర్ రిలీజ్ చేశాడు. ఈ చిత్రానికి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తుండగా, అదితీరావు హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
మొత్తం నిమిషం 50 సెకన్లున్న ఈ ట్రైలర్‌లో హీరో సుధీర్ డైలాగ్‌తో అదరగొట్టాడు. "స్టార్ల గ్లామర్ అబద్దం.. నటన అబద్దం.. మాటలు అబద్దం అయినా అమ్మాయిలు పడిపోతారేంట్రా" అనే డైలాగ్‌తో ప్రారంభించాడు. "స్టార్లు మామూలు మనుషులు కాదు.. మనం డబ్బులు ఇచ్చి సినిమాలకు వెళ్తున్నామంటే వారిలో ఏదో ఉంది" అని మరో డైలాగ్ ఆకట్టుకుంది. 
 
హీరోయిన్ అదితీ గ్లామర్‌తో ఆకట్టుకుంది. "ఈ సినిమా వాళ్ల మీద నాకున్న ఒపీనియన్ అంతా తప్పనుకున్నాను.. నిన్ను కలిసిన తర్వాత కాదని చెంప పగలగొట్టి మరీ ప్రూవ్ చేశావ్" అంటూ సుధీర్ బాబు ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్ సినిమాపై అంచ‌నాలు పెంచుతుంది. ఈ మూవీ జూన్ 15 రిలీజ్ కానుంది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీ వర్షంలో షూటింగ్... వరదనీటి ఉధృతికి కొట్టుకెళ్లిన సినీ దర్శకుడు