Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నేల నీకు అధికారం.. నేల మాకు జీవితం' అంటున్న రజనీకాంత్ .. "కాలా" ట్రైలర్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం "కాలా". ఈ చిత్రాన్ని ఆయన అల్లుడు, తమిళ హీరో ధనుష్ నిర్మించాడు. ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. "కబాలి" చిత్ర దర్శకుడు పా. రంజిత్‌ ఈ చిత్రానికి

Advertiesment
'నేల నీకు అధికారం.. నేల మాకు జీవితం' అంటున్న రజనీకాంత్ ..
, మంగళవారం, 29 మే 2018 (09:21 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం "కాలా". ఈ చిత్రాన్ని ఆయన అల్లుడు, తమిళ హీరో ధనుష్ నిర్మించాడు. ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. "కబాలి" చిత్ర దర్శకుడు పా. రంజిత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ముంబై నేపథ్యంలో మరోసారి డాన్‌గా తలైవా అలరించబోతున్నాడు.
 
ఇక ఈ ట్రైలర్ విషయానికొస్తే... ముంబైలోని ఓ బస్తీని, బస్తీవాసులను రక్షించే వ్యక్తిగా రజనీ పాత్ర ఉండేలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ నటుడు నానాపటేకర్‌ నటించారు. ఎవరైనా నన్ను ఎదిరించాలనుకుంటే మరణమే... అంటూ పటేకర్‌ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంది.
 
రజనీకి జోడీగా ఈశ్వరి, హూమా ఖురేషీలు నటించారు. 'ఈ తనువే మనకున్న ఏకైక ఆయుధం. ఇది ఈ లోకానికి చాటుదాం.. కదలండి ఉద్యమిద్దాం', 'నేల నీకు అధికారం.. నేల మాకు జీవితం' అంటూ రజనీ డైలాగులు ఓకే అనిపించాయి. సంతోష్‌ నారాయణన్‌ సంగీత బాణీలు సమకూర్చిన ఈ చిత్రం వచ్చే నెల ఏడో తేదీన విడుదల కానుంది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్విట్టర్‌లో మహేష్ బాబు ఎవ‌రెవ‌ర్ని ఫాలో అవుతున్నారో తెలుసా?