హీరోయిన్లందరూ నాకు కూతుర్లంటున్న హీరో...

రజినీకాంత్ తన సినిమాల్లో రొమాన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కబాలి సినిమాలో రాధికా ఆప్టేతో కూడా రొమాన్స్ లేదు. 2.0 సినిమాలో కూడా రజినీకాంత్ అమీ జాక్సన్‌తో రొమాన్స్ లేకుండా చేస్తున్నాడట. అందులో ఒక డ్రీమ్ సాంగ్ మాత్రమే ఉందట. అంతేకాదు ఒక కొత్త సినిమాలో

సోమవారం, 28 మే 2018 (20:48 IST)
రజినీకాంత్ తన సినిమాల్లో రొమాన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కబాలి సినిమాలో రాధికా ఆప్టేతో కూడా రొమాన్స్ లేదు. 2.0 సినిమాలో కూడా రజినీకాంత్ అమీ జాక్సన్‌తో రొమాన్స్ లేకుండా చేస్తున్నాడట. అందులో ఒక డ్రీమ్ సాంగ్ మాత్రమే ఉందట. అంతేకాదు ఒక కొత్త సినిమాలో సిమ్రాన్‌తో రజినీకాంత్ నటిస్తున్నాడట.
 
సూపర్ స్టార్ రజినీకాంత్ తన వయస్సును దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు. తన దర్శకులకు కూడా తన క్యారెక్టరైజేషన్ విషయంలో సూచనలిస్తున్నారట. హీరోయిన్లతో రొమాన్స్ చేసే సీన్లు ఎట్టి పరిస్థితుల్లోను రాయవద్దని నేరుగా డైరెక్టర్లకు చెప్పేస్తున్నాడట. అందుకే రజినీకాంత్ కొత్త సినిమాల్లో హీరోయిన్‌తో రొమాంటిక్ ట్రాక్ వంటివి అసలు కనిపించకుండా దర్శకులు జాగ్రత్తపడుతున్నారట. 
 
కబాలి సినిమా నుంచే ఈ ట్రెండ్‌లోకి వచ్చాడట రజినీకాంత్. సూపర్ స్టార్ వయస్సు 67. తాజాగా రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం సినిమాల మీద సినిమాలను ఒప్పుకుంటున్నాడట. త్వరలో విడుదల కానున్న కాల, 2.0 సినిమాలు కాకుండా మరో సినిమాకు కూడా రజినీ ఒప్పుకున్నారట. తాను ఎన్ని సినిమాలు  చేసినా ఖచ్చితంగా రొమాంటిక్ సన్నివేశాలు అసలు ఉండకూడదన్న షరతును పెట్టేశారట రజినీ.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అజ్ఞాతవాసిలో కీర్త‌న పెడితే వర్కవుట్ కాలేదు... మ‌రి 'అరవింద సమేత'లో...?