Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిట్టిబాబు చంపేశాడు.. రామలక్ష్మీ రఫ్ఫాడించేసింది... (Rangasthalam Theatrical Trailer)

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న "రంగస్థలం" సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌‌ను ఆదివారం విడుదల చేశారు. విశాఖ వేదికగా ఈ చిత్రం ప్రిరిలీజ్ కార్యక్రమం జరిగింది. ఇందులో ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు

Advertiesment
చిట్టిబాబు చంపేశాడు.. రామలక్ష్మీ రఫ్ఫాడించేసింది... (Rangasthalam Theatrical Trailer)
, సోమవారం, 19 మార్చి 2018 (09:21 IST)
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న "రంగస్థలం" సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌‌ను ఆదివారం విడుదల చేశారు. విశాఖ వేదికగా ఈ చిత్రం ప్రిరిలీజ్ కార్యక్రమం జరిగింది. ఇందులో ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. 
 
ఈ ట్రైలర్‌లో 'మా ఇంజన్‌కు కులం గోత్రాలు ఉండవు.. ఏ చేను అయినా తడిపేస్తది అంతే', 'చిట్టిబాబు చెవిలోకి మాటెళ్లడం కష్టం గానీ… ఒక్కసారి వెళ్లిందంటే అది గుండెల్లో ఉండిపోద్దయ్యా..', 'గిల్లుతున్నావేంటి గాజులు కొనిపెట్టమంటే..' అనే డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి.
 
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమంత హీరోయిన్‌గా… సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటించే వారి పాత్రలను చిత్ర బృందం పరిచయం చేసింది. రామ్‌చరణ్‌ చిట్టిబాబు పాత్ర పోషిస్తుండగా, సమంత రామలక్ష్మి పాత్రలో నటించింది. అనసూయ రంగమ్మత్త పాత్రలో కనిపించనుంది. 
 
వీరితో పాటు.. ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌, నరేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు  దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఆ ట్రైలర్‌ను మీరూ ఓసారి చూడండి. 



 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భరత్ అనే నేను.. పంచెకట్టులో మహేష్ బాబు (ఫోటో)