'రంగస్థలం' అందరికీ నచ్చుతుంది.. మిస్ అవ్వొద్దు : రామ్ చరణ్
ప్రముఖ ఐటీ కంపెనీ వర్చ్యూసా `ది జోష్ 2018-అవర్ యాన్యువల్ ఎంప్లాయ్ ఎంగేజ్మేంట్` (జోష్ ఫాంటసీ సెసన్-4) ప్రొగ్రామ్ ఉద్యోగుల ఆట, పాటల నడుమ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాపవర్ స్టార్ రామ్ చర
ప్రముఖ ఐటీ కంపెనీ వర్చ్యూసా `ది జోష్ 2018-అవర్ యాన్యువల్ ఎంప్లాయ్ ఎంగేజ్మేంట్` (జోష్ ఫాంటసీ సెసన్-4) ప్రొగ్రామ్ ఉద్యోగుల ఆట, పాటల నడుమ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఉద్యోగులకు జ్ఞాపికల్ని.. ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
అనంతరం రామ్ చరణ్ మాట్లాడుతూ, `మీరు చూపిస్తోన్న ఉత్సాహం... మిమ్మల్ని అందర్నీ చూస్తుంటే నాకు నా కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి. మీ అందర్నీ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ నెలలో నాకిది బెస్ట్ డే. ప్రతీ కంపెనీకి ఉద్యోగులే కీలకం. వాళ్ల కష్టంతోనే కంపెనీలు పైకొస్తాయి. ఇక్కడ ఉద్యోగులే వర్య్చూస్‌ను ఈ స్థాయిలో నిలబెట్టారనిపిస్తోంది. వర్చ్యూస్‌లో పనిచేస్తోన్న చాలామంది ఉద్యోగులు రక్తదానం చేశారు. చాలా మంచి సేవా కార్యక్రమం అది. మేము తలపెట్టిన ఆ కార్యక్రమానికి ఇంతమంది ఎంతో బాధ్యత తీసుకుని చేస్తున్నందకు చాలా గర్వంగా ఉంది. ఇలాగే మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నా.
డాన్స్, పాటల ప్రదర్శన చాలా బాగుంది. హరిత `రంగమ్మ మంగమ్మ` పాటను ఒరిజినల్ సింగర్ కన్నా బాగా పాడారు. ఇక రంగస్థలం సినిమా కోసం ఏడాది పాటు కష్టపడ్డాను. గుబురు గెడ్డం... మీసంతోనే ఉన్నాను. ఆ రెండు తీసిన తర్వాత హాజరైన తొలి కార్యక్రమం ఇది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే మీరు ఎప్పుడు పిలిచినా రావడానికి నేను సిద్ధం. రంగస్థలం సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా నాకొక కొత్త అనుభూతినిచ్చింది. నా గత సినిమాలు మిస్ అయినా... ఈ సినిమా మాత్రం తప్పకుండా అందరూ చూడండి. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది` అని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్చ్యూస్ యాజమన్యం, ఉద్యోగులు పాల్గొన్నారు.