Webdunia - Bharat's app for daily news and videos

Install App

విక్రమాదిత్య ఎవరు? ఆలోచ‌న దేనికి? పుట్టిన రోజునే వెల్ల‌డిస్తాం

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (17:09 IST)
Vikramadithya -Prabhas
చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ మళ్లీ రొమాంటిక్ జోనర్లో సినిమా చేస్తున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత రాధే శ్యామ్ సినిమాలో విక్రమాదిత్య అనే రొమాంటిక్ పాత్రలో నటిస్తున్నారు ప్రభాస్. ఈ మధ్య హీరోయిన్ పూజా హెగ్డే పుట్టిన రోజు ఆమె స్పెషల్ బర్త్ డే పోస్టర్ విడుదల చేశారు. ఇప్పుడు ప్రభాస్ పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదల చేయబోతున్నారు. విక్రమాదిత్య అంటే ఎవరు అంటూ పోస్టర్‌పై రాసుకొచ్చారు. టీజర్‌లో దీనికి సమాధానం చెప్పబోతున్నారు. 
 
తాజాగా విడుదలైన పోస్టర్‌లో బాగా ఆలోచిస్తున్నారు ప్రభాస్. ఈ ఫోటోలో ప్రభాస్ లుక్స్ చాలా షార్ప్‌గా ఉన్నాయి. కళ్లలో ఏదో తెలియని కంగారు కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఈ పోస్టర్ చాలా ఇంటెన్స్‌గా అనిపిస్తుంది. బాగా లోతుగా అర్థం కనిపిస్తుంది. విడుదలైన క్షణం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది ఈ పోస్టర్.
 
ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఒక్కో పోస్టర్ విడుదలవుతున్న సమయంలో వాటికి వస్తున్న స్పందన చూస్తుంటే.. మేకర్స్‌పై మరింత భాద్యత పెరిగిపోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ కంటెంట్‌ను కూడా మనస్పూర్థిగా ఆహ్వానించారు ఫ్యాన్స్. ప్రతీ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ అందించారు. తాజాగా అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విక్రమాదిత్య కారెక్టర్ టీజర్ విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. 
 
ఈ టీజర్‌లో డైలాగ్స్ అన్నీ ఇంగ్లీష్‌లో ఉండబోతున్నాయి. భిన్నమైన భాషల్లో సబ్ టైటిల్స్ కనిపిస్తాయి. ఈ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. కొన్ని రోజులుగా విడుదలవుతున్న ఈ సినిమా లుక్స్ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు వాళ్లను తెరపై చూస్తామా అని అభిమానులు వేచి చూస్తున్నారు. జనవరి 14, 2022న ఈ సినిమా విడుదల కానుంది. తెలుగుతో పాటు పాన్ ఇండియన్ స్థాయిలో రాధే శ్యామ్ విడుదల కానుంది. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డాక్టర్ యువీ కృష్ణంరాజు గారు సమర్పిస్తున్నారు. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మాతలు.
 
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్య శ్రీ, ప్రియదర్శి, సచిన్ ఖేడ్‌కర్, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments