Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#RadheShyam టీజర్ వచ్చేస్తోంది..

#RadheShyam టీజర్ వచ్చేస్తోంది..
, బుధవారం, 20 అక్టోబరు 2021 (10:27 IST)
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ రాధేశ్యామ్ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్‌ చేస్తుండగా.. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో రాధేశ్యామ్‌ తెరకెక్కుతోంది. 
 
1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే జంటగా నటిస్తుంది. భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి.అయితే తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 23 వ తేదీన ప్రభాస్‌ పుట్టిన రోజు ఉంది. 
 
ఈ నేపథ్యంలోనే 23వ తేదీన ఉదయం 11.16 గంటలకు రాధేశ్యామ్‌ టీజర్‌‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అనౌన్స్‌ చేసింది. ఈ మేరకు ప్రభాస్‌ పోస్టర్‌ ను విడుదల చేసింది రాధేశ్యామ్‌ చిత్ర బృందం. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా అంటే జనవరి 14 తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సురేఖా వాణి రెండో పెళ్లి చేసుకున్నారా? మెడలో తాళితో కనిపించడంతో..?!