తెలుగు నటుడు ప్రపంచవ్యాప్తంగా పరిచయం అవడం ఒక భాగమైతే అక్కడవారిలోనూ అభిమానం సంపాదించడం మరో ఎత్తు. ఇది మామూలు విషయంకాదు. అలాంటి డార్లింగ్ ప్రభాస్ గుర్తింపు పొందాడు. ఆయన పుట్టినరోజు ఈనెల 23. అప్పటికి 42 సంవత్సరాలు చేరుకుంటాడు. తాజాగా రాధేశ్యామ్, సలార్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయా చిత్రాలకు సంబంధించిన తాజా సమాచారం రెండురోజుల్లో రాబోతోంది.
అందుకే తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఓ స్టిల్ బయకు వచ్చింది. ఠీవీగా రిలాక్స్‌గా కూర్చున్న పిక్ ప్రభాస్ టీమ్ బయట పెట్టింది. సినిమా రీల్ తరహాలో రౌండ్‌గా కనిపిస్తూ దానిమీద కూర్చోగా కింద టాలీవుడ్ లో కాలుపెట్టి, బాలీవుడ్‌లో చేతులు పెట్టి, హాలీవుడ్‌లో తల పెట్టిచూస్తున్న ఈ ఫొటో అభిమానులను అలరిస్తోంది. ప్రభాస్ కెరీర్ సింబాలిక్ గా వుండేలా చేశారు. ప్రేక్షకులు కూడా అందులో చొప్పించి వినూత్నమైన పోస్టర్‌ను డిజైన్ చేశారు. అంకితభావం, శ్రమ, క్రమశిక్షణ అతనిని మిలియన్ల మంది డెమిగోడ్‌గా, బిలియన్ల స్ఫూర్తిగా చేసిందనే కామెంట్ కూడా ఆయన అభిమానులు జోడించారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు సోదరుని కుమారుడయిన ప్రభాస్ `ఈశ్వర్` సినిమాతో తెరంగేట్రం చేశాడు. అనంతరం వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ వంటి చిత్రాలు చేస్తూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌కు రాజమౌళి ఆవిష్కరించిన `బాహుబలి` పేరుకు తగినట్లే ప్రపంచానికి పరిచయం చేసింది. ఇంకా పెళ్లికానీ ఈ బేచలర్ ఈ ఏడాదైనా ఒకింటివాడిని చేయాలనే ఆలోచనను ఇటీవలే కృష్ణంరాజు వెలిబుచ్చారు.