Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభాస్ రిలీజ్ చేసిన ఆకాష్ పూరి - రొమాంటిక్ ట్రైలర్

Advertiesment
ప్రభాస్ రిలీజ్ చేసిన  ఆకాష్ పూరి - రొమాంటిక్  ట్రైలర్
, మంగళవారం, 19 అక్టోబరు 2021 (18:20 IST)
Prabhas Romantic trailer
ఆకాష్ పూరి, కేతిక శర్మ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న‌ రొమాంటిక్ డ్రామా `రొమాంటిక్` అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. మంగ‌ళ‌వారంనాడు  ప్రభాస్ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ముంబైలో వున్న ఆయ‌న ఎ.ఎం.బి.మాల్ లో జ‌రిగిన ఆన్‌లైన్‌లో విడుద‌ల చేశారు.
 
ప్రభాస్ మాట్లాడుతూ, ‘రొమాంటిక్ ట్రైలర్ నిజంగానే రొమాంటిక్‌గా ఉంది. ఆకాష్ అద్భుతంగా నటించాడు. డైరెక్టర్ అద్భుతంగా తెర‌కెక్కించారు. పదేళ్ల అనుభవం ఉన్నట్టుగా, స్టార్ స్టేటస్ వచ్చినట్టుగా లాస్ట్ షాట్‌లో అద్బుతంగా అనిపించాడు. ఆకాష్‌ మొదటి సినిమాకు ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయ్యాడు. హీరోయిన్‌ అందరికీ ఈజీగా రీచ్ అవుతుంది. రమ్యకృష్ణగారు ఎప్పటిలానే అద్భుతంగా నటించారు. అందరూ అక్టోబర్ 29న‌ ఈ సినిమాను చూడండి. చిత్రయూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
 
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ, ‘డార్లింగ్ ప్రభాస్ ఈ మూవీ ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. సినిమా విడుదల చేస్తున్నామని తెలిశాక ప్రభాస్ ఫోన్ చేసి మరీ పదే పదే అడిగారు. సినిమా గురించి ట్వీట్ వేయాలా? పోస్ట్ చేయాలా? ఏదైనా ఇంటర్వ్యూ ఇవ్వాలా? ఈవెంట్‌కు రావాలా? అంటూ ఫోన్ చేసి మరీ అడిగాడు. ప్రభాస్ అంత మంచి వాడు’ అని అన్నారు.
 
ఛార్మీ మాట్లాడుతూ.. ‘రొమాంటిక్ ట్రైలర్‌ను ప్రభాస్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ సర్ ప్రైజింగ్‌గా ఉండబోతోంది. డార్లింగ్ అంటూ ఓ పాట రానుంది. సినిమాలో రమ్యకృష్ణ అద్భతంగా నటించారు. వీఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అనిల్.. ఈ మూవీ అద్భుతంగా తెరకెక్కించాడు. ఆకాష్, కేతిక శర్మ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఎక్కడికి వెళ్లినా కేతిక గురించి అడుగుతుంటారు’ అని అన్నారు.
 
2నిమిషాల10 సెకండ్ల నిడివిగ‌ల ఈ ట్రైల‌ర్‌ను గ‌మనిస్తే, రొమాంటిక్ టైటిల్‌కు న్యాయం చేసేలా ఉంది. ఆకాష్ పూరి, కేతికల మధ్య రొమాంటిక్స్ సీన్స్ పుష్కలంగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. స్వచ్చమైన ప్రేమకు, శరీరాన్ని చూసి పుట్టే ప్రేమకు మధ్య ఉండే తేడాను ఈ సినిమాలో చూపించినట్టు కనిపిస్తోంది.
 
వాస్కో పాత్రలో ఆకాష్ పూరి, మౌనిక క్యారెక్టర్‌లో కేతిక శర్మ రొమాంటిక్స్ సీన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యేలా ఉన్నారు. రొమాంటిక్  సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌, డైలాగ్ డెలివరీలో ఆకాష్ పూరి అద్భుతంగా న‌టించారు. కేతిక శర్మ తన అందాలతో  కుర్రకారును కట్టిపడేసేలా ఉంది. ఈ ఇద్దరి జోడి తెరపై ఫ్రెష్‌గా కనిపించింది. రమ్యకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించింది.
 
పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్స్ రొమాంటిక్ చిత్రానికి ప్లస్ అవ‌నున్నాయి.  సునీల్ కశ్యప్ సంగీతం, నరేష్ సినిటోగ్రఫీ బాగా కుదిరాయి. మొత్తంగా రొమాంటిక్ ట్రైలర్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. సినిమా మీద అంచనాలను పెంచేలా ఉంది.  పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 29న  ఈ చిత్రం విడుదలకానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆకాశ్ పూరి హీరోగా "రొమాంటిక్" - ట్రైలర్ రిలీజ్