Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారం ముందుగానే వ‌స్తోన్న ఆకాష్ పూరి రొమాంటిక్

Advertiesment
వారం ముందుగానే వ‌స్తోన్న ఆకాష్ పూరి రొమాంటిక్
, సోమవారం, 18 అక్టోబరు 2021 (16:01 IST)
Akash Puri, Ketika Sharma
పూరి జగన్నాథ్ నిర్మాణంలో ఆకాష్ పూరి హీరోగా రూపొందుతున్న `రొమాంటిక్` సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అనుకున్నదానికంటే ఓ వారం ముందుగానే సినిమాను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 29న ఈ చిత్రం థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
విడుదల తేదీని ప్రకటిస్తూ వదిలిన పోస్టర్‌లో కేతిక శర్మ. ఆకాష్ పూరి ఇద్దరి జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యేట్టు కనిపిస్తోంది.
ఈ చిత్రాన్ని పూరి  జగన్నాథ్ నిర్మించడమే కాకుండా.. కథను, మాటలు, స్క్రీన్ ప్లేను అందించారు. పూరి జగన్నాథ్ శిష్యుడు అనిల్ పాదూరి తెరకెక్కిస్తున్నారు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ‘రొమాంటిక్’ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తుండగా.. నరేష్ సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు.
 
మేకర్స్ ఇప్పటి వరకు మూడు పాటలను రిలీజ్ చేశారు. అన్నీ కూడా అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ర‌క్త‌ దానం, కంటిదానం, ఆక్సిజ‌న్ కావాలనే వారికి ఆన్‌లైన్ సేవ‌లుః రామ్‌చ‌ర‌ణ్‌