Webdunia - Bharat's app for daily news and videos

Install App

వకీల్ సాబ్ ఏం చేస్తున్నాడు? ప్రేక్షకుల ముందుకు వస్తాడా? రాడా?

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (08:50 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు - బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. దీనికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. 
 
మగువా మగువా అంటూ సాగే ఈ సినిమాలోని పాటను రిలీజ్ చేయడం.. ఈ పాట యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకెళుతుండడం తెలిసిందే. నివేథా థామస్, అంజలి, అనన్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే... కరోనా నేపధ్యంలో సినిమా హాల్లు, సినిమా షూటింగులు ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో పవన్ అభిమానులు అందరిలో ఉన్న డౌట్ ఏంటంటే...  వకీల్ సాబ్ ఏం చేస్తున్నాడు.?
 
ఇప్పటివరకు ఎంత షూటింగ్ అయ్యింది..? ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుంది..? అని. అసలు విషయం ఏంటంటే... షూటింగ్స్ లేకపోవడంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్‌కి డబ్బింగ్ చెబుతున్నారు. అలాగే తను చేయనున్న తదుపరి సినిమాకి సంబంధించి కథా చర్చల్లో పాల్గొంటున్నారని తెలిసింది. 
 
ఈ షూటింగ్ చివరి దశలో ఉండగానే బ్రేక్ పడింది. ఇంకో పది పదిహేను రోజులు షూటింగ్ చేస్తే.. వకీల్ సాబ్ షూటింగ్ కంప్లీట్ అవుతుందని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. పవన్ మరో వైపు రాజకీయాల గురించి కూడా ఆలోచిస్తూ.. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని పై కసరత్తు చేస్తున్నారని తెలిసింది. 
 
ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల గురించి మరో వైపు రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారు. ఈ క్రేజీ మూవీని మే 15 రిలీజ్ చేయనున్నట్టు గతంలో ఎనౌన్స్ చేసారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఆగష్టులో రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి.. ఇది నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అబద్ధాలను అందంగా చెప్పడంలో జగన్ మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: వైఎస్ షర్మిల

యువతిని పొట్టనబెట్టుకున్న పెద్దపులి.. పొలాల్లో పనిచేస్తుండగా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments