లాక్ డౌన్‌తో చాలామంది నిరుపేదల పరిస్థితి ధీనంగా మారిపోతోంది. తినడానికి తిండిలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దాతలు అందరూ ముందుకు వచ్చినా కొంతమంది నిరుపేదలకు మాత్రం పూర్తిస్థాయిలో భోజనం అందడం లేదు. అయితే పట్టణాల్లో కొంతమంది దాతలు సహాయం చేస్తూ వారికి అండగా ఉంటున్నారు.
కానీ గ్రామాల్లో అయితే పరిస్థితి మరింత దయనీయం. పట్టణాల్లోకి వచ్చి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయలేక..గ్రామాల్లో చెట్ల కింద కూర్చుని నానా బాధలు పడుతున్నారు. అలాంటి వారి కోసం సినీనటుడు మోహన్ బాబు ప్రత్యేకంగా అన్నదానం చేస్తున్నారు.
చిత్తూరుజిల్లా రంగంపేటలోని తన సొంత విద్యాసంస్ధలైన రంగంపేటకు చుట్టుప్రక్కల ఉన్న 8 గ్రామాలను దత్తత తీసుకున్నారు మోహన్ బాబు, మంచు విష్ణు. నేటి నుంచి ప్రతిరోజు 8గ్రామాల ప్రజలకు భోజనం మధ్యాహ్నం, రాత్రి వేళల్లో పంపిణీ చేయడంతో పాటు 8 టన్నుల కూరగాయలను అందజేస్తున్నారు.
ఇలా లాక్ డౌన్ ముగిసేంత వరకు నిరుపేదలకు సేవ చేస్తానంటున్నారు మోహన్ బాబు. స్వయంగా మంచు విష్ణు ఆహార పొట్లాలను గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో కొంతమంది రైతుల ధీనస్థితిని చూసిన విష్ణు స్వయంగా బట్టలను కూడా అందజేస్తున్నారు.