రాధికా కుమారస్వామి. చివరలో కుమారస్వామి పేరు చదివితేనే అందరికీ అర్థమైపోయి ఉంటుంది. కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి సతీమణి అని. ఈమె ఒకప్పుడు టాప్ హీరోయిన్. ఈమె సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎలాంటి క్యారెక్టర్ అయినా అదుర్స్ అనిపించేలా చేయగల సత్తా రాధికా సొంతం.
అయితే కుమారస్వామితో పెళ్ళయిన తరువాత కొన్నిరోజుల పాటు తెరపైన కనిపించకుండా పోయారు రాధికా. తెరకు చాలా దూరంగా ఉన్నారు. కానీ ఆమె మళ్ళీ తెరపైకి వచ్చేందుకు సిద్థమయ్యారు. శ్రీరామనవమి సెంటిమెంట్‌గా ఒక సినిమాలో షూటింగ్ చేసేందుకు సిద్థమయ్యారు రాధికా.
అయితే కరోనా వైరస్ పుణ్యమా అని ఆ షూటింగ్ కాస్తా ఆగిపోయింది. ఆ సినిమా పేరు భైరదేవీ. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. ఈ సినిమాతో తనకు గతంలో ఉన్న క్రేజ్ మళ్ళీ తెచ్చుకుంటానన్న నమ్మకంతో ఉన్నారు రాధిక. కానీ అది కరోనా కారణంగా ఆలస్యమవుతుండటంతో ఆమె మూడీగా మారిపోయారట. కానీ త్వరలోనే తాను కూడా షూటింగ్‌లో పాల్గొని తీరుతానని, మళ్ళీ అభిమానులను సంపాదిస్తానని ధీమాగా చెబుతోందట.
ఇదంతా ఒకే గానీ రాధికా మాత్రం యువ హీరోలతోనే నటిస్తానని దర్సక, నిర్మాతలకు తేల్చి చెప్పేస్తోందట. సీనియర్ హీరోలతో నేను ఇక చేయలేను. యువ హీరోలతోనే అయితే నటిస్తాను. లేకుంటే వేరే హీరోయిన్లను చూసుకోండి అంటూ చెప్పేస్తోందట. వచ్చిందే ఒక సినిమా ఛాన్స్..అప్పుడే ఇన్ని షరతులా అంటూ రాధికాపై దర్సక నిర్మాతలు గుర్రుగా ఉన్నారట.