Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పక్కా మాస్ లుక్‌లో బంటు... బన్నీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్

Advertiesment
పక్కా మాస్ లుక్‌లో బంటు... బన్నీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్
, బుధవారం, 8 ఏప్రియల్ 2020 (11:46 IST)
మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్. గత సంక్రాంతికి "అల వైకుంఠపురములో" అనే చిత్రంతో వచ్చి సందడి చేశాడు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్. బన్నీ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఇపుడు లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 8వ తేదీన బన్ని పుట్టిన రోజు కావడంతో ఆయన అభిమానులకు సుకుమార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. 
 
తన కొత్త చిత్రంలోని ఓ లుక్‌ను రిలీజ్ చేశారు. అందులో ఎంతో స్టైలిష్‌గా కనిపించే బంటు.. ఇందులో పక్కా మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. చిత్ర టైటిల్‌తో పాటు బన్ని ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను సుకుమార్ ప్యాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు.. హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నాడు. అంతేకాకుండా ఆయా భాషల్లో సంబంధించిన పోస్టర్స్‌ కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు.
 
'ఏమబ్బా, అందరూ బాగుండారా.. మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తాండే.. ఏఏ20 అప్‌డేట్‌ ఏప్రిల్‌ 8న, తెల్లార్తో 9 గంటలకు వస్తాండాది.. రెడీ కాండబ్బా, యోవ్ సిద్ధంగా ఉండారా?!'  అంటూ చిత్ర నిర్మాణ సంస్థ రాయలసీమ యాసలో వరుస ట్వీట్లు చేసింది. అయితే అధికారికంగా ప్రకటించే వరకు ఓపికపట్టని కొందరు మంగళవారం సాయంత్రమే అల్లు అర్జున్‌ కొత్త సినిమా టైటిల్‌ ‘పుష్ప’అని అందులో బన్ని పేరు ‘పుష్పక్‌ నారాయణ్‌’ అని రివీల్‌ చేశారు. 
 
ఈ ఫస్ట్‌లుక్‌లో అల్లు అర్జున్ మాసిన జుట్టు, గెడ్డం, మెడలో నల్లతాడు, చిరిగిపోయిన గళ్ళ చొక్కాతో డీ గ్లామర్ లుక్‌లో కనిపిస్తూ, ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా డిఫరెంట్ లుక్‌లో బన్నీ కనిపిస్తున్నాడు. పైగా, బంటు వేసుకున్న చొక్కా కూడా చాలా పాత స్టైల్లో ఉంది. దీన్నిబట్టి చూస్తే ఈ చిత్రం కూడా 1980ల ​కాలంలో సాగే కథ కావచ్చని అనేక మంది ఊహిస్తున్నారు. ఇప్పటివరకు సోషల్‌ మీడియాలో జరిగిన ప్రచారాన్ని బట్టి ఈ సినిమాలో లారీ డ్రైవర్‌ పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. దీంతో లారీ డ్రైవర్‌ పాత్రకు తగ్గట్టు బన్ని లుక్‌ను సకుమార్‌ డిజైన్‌ చేసినట్టు తెలుస్తోంది. 
 
కాగా, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా, రష్మిక మందన్నా హీరోయిన్. దేవీశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పుటి నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో ఫ్యాన్స్‌ నిరుత్సాహపడ్డారు. అయితే ఈరోజు అల్లు అర్జున్‌ బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ దేవరకొండ కనిపించడంలేదు, అభిమానుల ఫిర్యాదు...?