Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ కొత్త వ్యాపారం.. ప్రభాస్, మహేశ్ బాటలో..

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (12:29 IST)
అర్జున్ రెడ్డి సినిమాతో మంచి గుర్తింపు, యూత్ ఫాలోయింగ్ తెచ్చుకున్న సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ అప్పటి నుండి మంచి జోరు కొనసాగిస్తున్నాడు. చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న విజయ్‌ వ్యాపార రంగంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. 
 
తన అభిమానులను ముద్దుగా రౌడీస్‌ అంటూ పిలిచే విజయ్‌ దేవరకొండ అదే పేరుతో బ్రాండ్‌ను సృష్టించి ఆన్‌లైన్‌లో రెడీమేడ్‌ డ్రెసెస్‌ విక్రయిస్తున్నాడు. వ్యాపార రంగంలోనూ సక్సెస్‌ సాధించిన విజయ్ కొత్త రంగంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. 
 
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఏఎంబీ సినిమాస్ పేరుతో హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్‌ను స్టార్ట్ చేయగా ప్రభాస్‌ సూళ్లురుపేటలో వీ ఎపిక్‌ పేరుతో ఓ మల్టీప్లెక్స్‌ను నిర్మించాడు. ఇప్పుడు రౌడీ బాయ్ కూడా అదే బాటలో మల్టీప్లెక్స్ బిజినెస్ ప్రారంభించనున్నారు. 
 
ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఏసియన్‌ గ్రూప్‌తో కలిసి మహబూబ్‌నగర్‌లో ఓ మల్టీప్లెక్స్‌ను నిర్మించనున్నాడు. ప్రస్తుతం ఏవీడీ పేరుతో ఈ మల్టిప్లెక్స్‌ నిర్మాణం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments