వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ రిలీజ్ టైమ్ చెప్పిన యూనిట్...

శుక్రవారం, 3 జనవరి 2020 (11:32 IST)
టాలీవుడ్ సెన్సేషన్‌గా మారిన విజయ్ దేవరకొండ సినిమాలపై యూత్‌లో ఎనలేని క్రేజ్ ఉంటుంది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్ డూపర్ హిట్స్‌తో మంచి యూత్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఈ రౌడీ బాయ్ ఆ తర్వాత చేసిన డియర్ కామ్రేడ్ ఎన్నో అంచనాల మధ్య విడుదలై హిట్ కాకపోయినప్పటికీ విజయ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
 
ఈ సినిమా తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ప్రేమికుల రోజున వచ్చేందుకు రెడీ అయ్యాడు విజయ్. ఇందులో విజయ్ సరసన ఐశ్వర్యా రాజేశ్, ఇసబెల్లా, రాశీ ఖన్నా, క్యాథరిన్ థ్రెస్సాలు హీరోయిన్లుగా నటిస్తుండగా ఇప్పటికే వీరి పోస్టర్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. 
 
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ను విజయ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసాడు. ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం #F2కి సీక్వెల్ రానుంది.. వెంకటేష్ ఏం చెప్పారంటే?