Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడి పేరుతో పూజ భాలేక‌ర్‌ను లాక్ చేసిన వ‌ర్మ!

Webdunia
బుధవారం, 13 జులై 2022 (10:02 IST)
Varma-pooja
రామ్‌గోపాల్ `కొండా` సినిమా త‌ర్వాత విడుద‌ల చేస్తున్న సినిమా `ల‌డ్‌కీ`. లేడీ ఓరియెంటెడ్ సినిమా. చైనా కంపెనీలో కొలాబ‌రేష‌న్‌తో ఈ సినిమా నిర్మించారు. అయితే ఈ ల‌డ్‌కీ క‌థ‌కు హీరోయిన్‌గా ఎవ‌రు స‌రిపోతార‌ని ఆలోచిస్తూ, బ్రూస్‌లీలా ఫైట్లు చేయాల్సిన అమ్మాయి ఎవ‌రు వుంటార‌ని త‌న‌కు తెలిసిన విదేశాల్లోని మేనేజ‌ర్ల‌తో సంప్ర‌దించారు. చాలామ‌టుకు ఆయ‌న ఆలోచ‌న‌ల‌కు త‌గిన‌ట్లుగా బ్రూస్‌లీని మైమ‌రిపించేలా ఎవ‌రూ ల‌భించ‌లేదు. ఫైన‌ల్‌గా ఓ కోఆర్డినేట‌ర్.. పూనెలో రియ‌ల్ ఫైట‌ర్ వున్నార‌ని చెప్ప‌డంతో ఆమె కుటుంబాన్ని క‌లిశాడు. ఆమె పేరే పూజ భాలేక‌ర్‌.
 
ఆమె క‌లిసి త‌న సినిమా క‌థ ఆలోచ‌న‌ను వెల్ల‌డించాడు. అందుకు ఆమె అంగీక‌రించ‌లేదు. సినిమా అంటేనే గ్లామ‌ర్‌క‌దా ఒప్పుకోలేదు. నాకు ఈ లైఫ్ చాలా బాగుంది. నేను సినిమాల్లోకి రాన‌ని తేల్చిచెప్పింది. అప్పుడు వ‌ర్మ ఏం చేశాడో తెలుసా!.. ఇది వ‌ర‌ల్డ్ సినిమా. చైనా కొలాబ‌రేష‌న్ స‌హ‌కారంతో వేల థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతుంది అంటూ నెమ్మ‌దిగా సినిమా క‌థ‌ను, నిర్భ‌య‌కు క‌రాటే వ‌స్తే.. ఆ న‌లుగురి ప‌రిస్థితి ఎలా వుంటుంది? అనే కోణంలో నేను క‌థ రాసుకున్నాను. అంటూ మొత్తానికి ఒప్పించాడు.
 
అయితే వ‌ర్మ సినిమాల్లో గ్లామ‌ర్‌కూడా చూపించాలిక‌దా.. అందుకు ఆమెను అంగీక‌రించేలా.. ఓ డైలాగ్ కొట్టాడట‌. నువ్వు ప‌క్కింటి అమ్మాయిలా అంద‌రికీ క‌నిపిస్తావు. నీలో న‌చ్చింది అదే. అందులోనూ చాలా అందంగానూ వున్నావు. ఈ అందాన్ని నీ భ‌ర్త‌కేకాదు కోట్ల‌మందికి చూపిస్తే బాగుటుంది. దేవుడు నీకు మంచి అందాన్ని విద్య‌ను ఇచ్చాడు. ఇంత అందంగా పుట్టించిన దేవుడికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకొనేటైం వ‌చ్చింది. లేదంటే దేవుడు కూడా ఫీల‌వుతాడు. ఇంత అందాన్ని ఇచ్చాను ఈమె ఉప‌యోగించుకోవ‌డంలేద‌ని అనుకోవ‌డం నీకు ఇష్ట‌మేనా! అంటూ సెంటిమెంట్‌మీద కొట్టాడు. దాంతో ఆమె అంగీక‌రించింది. అంటూ ఆమె ఒప్పించేవిధానం తెలియ‌జేశాడు. వ‌ర్మ‌. ఈ ల‌డ్‌కీలో ఫైట్లు ఎలా వుంటాయో.. ఆమె గ్లామ‌ర్‌కూడా అలానే వుంటుంది. నో కాంప్ర‌మైజ్ అంటూ.. వ‌ర్మ శైలిలో సెల‌విచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరుగడ్డ అనిల్‌కు రాచమర్యాదలకు రూ.5 లక్షలు

రామ్‌గోపాల్ వర్మ సంగతి నన్ను అడిగితే ఎలా? అది హోం శాఖ పరిధిలో వుంది: పవన్ (video)

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments