Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కెరీర్‌లో ఇది ఉత్తమ చిత్రం - అక్కినేని నాగచైతన్య

Webdunia
బుధవారం, 13 జులై 2022 (09:39 IST)
Raashikhanna, Akkineni Naga Chaitanya, Vikramkumar
అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజాచిత్రం ‘థాంక్యూ’ .విక్రమ్‌కుమార్‌ దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు,శిరీష్‌ నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, మాళవిక నాయర్‌ నాయికలు. ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదల కానుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం రాత్రి అక్కినేని అభిమానులు, చిత్ర యూనిట్‌ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. 
 
ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ‘ అక్కినేని అభిమానులకు ఈ సినిమా విందుభోజనంలా వుంటుంది. ఈ చిత్రంలో నాగచైతన్య మూడు వేరియేషన్స్‌లో  కనిపిస్తాడు. థియేటర్‌ నుంచి బయటికి వచ్చిన తరువాత కూడా చైతన్య పాత్రలోని ఎమోషన్స్‌తో ట్రావెల్‌ అవుతాం. జోష్‌ తరువాత చైతూకు జీవితాంతం గుర్తుండే సినిమాను ఇవ్వాలని అనుకున్నాను. అది ఈ చిత్రంతో తీరింది. ఈ చిత్రం అందరి హృదయా ల్లో గుర్తుండిపోయే సినిమాగా వుంటుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఓ అద్భుతమైన సినిమా చూశామనే ఫీలింగ్‌తో థియేటర్‌ నుంచి బయటికొస్తారు’ అన్నారు. 
 
హీరో నాగచైతన్య మాట్లాడుతూ ‘అభిమానుల ప్రేమ , ఎనర్జీ చూస్తుంటే ఎంతటి కష్టమైనా చేయాలనిపిస్తుంది. ‘థాంక్యూ’ లాంటి సినిమా చేసే అవకాశం చాలా అరుదుగా వస్తుంటుంది. ఇందులో నా పాత్రలో చాలా లేయర్స్‌ వుంటాయి. ఈ సినిమా తప్పకుండా అందరి హృదయాలను గెలుచుకుంటుందనే నమ్మకం వుంది’ అన్నారు.ఓ మంచి టీమ్‌తో ఇలాంటి చిత్రం చేయడం ఆనందంగా వుందని దర్శకుడు విక్రమ్‌కుమార్‌ తెలిపారు. రాశీఖన్నా మాట్లాడుతూ ‘ఈ చిత్రం కథతో పాటు నా పాత్ర బాగా నచ్చింది. ఈ సినిమాలో ప్రతి సీన్‌ అందమైన పెయింటింగ్‌లా వుంటుంది. నా కెరీర్‌లో ఇది ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది అన్నారు. 
 
కథా రచయిత బీవీఎస్‌ రవి మాట్లాడుతూ ‘నాగచైతన్య సినిమాకు పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఈ చిత్రంతో కుదిరింది. చైతన్య అభిమానులు గర్వంగా ఫీలయ్యే సినిమా ఇది. ఈ చిత్రంలో మూడు వేరియేషన్స్‌ ల్లో అద్బుతగా నటించాడు’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments