Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన‌న్య‌తో విజిల్ కొట్టిస్తున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda, Ananya Pandey,
, బుధవారం, 6 జులై 2022 (18:05 IST)
Vijay Devarakonda, Ananya Pandey,
పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్  ''లైగర్''(సాలా క్రాస్‌బ్రీడ్). తాజాగా చిత్ర నిర్మాతలు మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 'లైగర్' ఫస్ట్ సింగిల్ అక్డీ పక్డీ ప్రోమోని జూలై 8న విడుదల చేసి, పూర్తి పాటని 11న రిలీజ్ చేయనున్నారు.
 
అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఫుల్ హ్యాపీ మూడ్‌లో కనిపించారు. ఈ పోస్టర్ విజయ్ దేవరకొండ తన చేత్తో అనన్య చేత విజల్ కొట్టించేలా చూపించడం అలరించింది. ఈ పార్టీ సాంగ్ పెప్పీ నెంబర్ గా వుండబోతుంది. విజయ్ దేవరకొండ రెడ్ బ్లేజర్‌లో కనిపిస్తుండగా, అనన్య బ్లాక్ అవుట్ ఫిట్స్ లో మెరుస్తోంది. పబ్ సెట్‌లో ఈ పాట చిత్రీకరించారు.
 
లిజో జార్జ్-డిజె చేతాస్ ఈ పాటను స్వరపరచగా, హుక్‌లైన్ సునీల్ కశ్యప్ ఇవ్వగా, అజీమ్ దయాని మ్యూజిక్ ని సూపర్ వైజ్ చేశారు. దేవ్ నేగి, పావ్నీ పాండే, లిజో జార్జ్ ఈ పాట హిందీ వెర్షన్‌ను పాడారు. ఈ పాటకు మొహ్సిన్ షేక్, అజీమ్ దయాని సాహిత్యం అందించారు.
 
తెలుగులో అనురాగ్ కులకర్ణి,  రమ్య బెహరా ఆలపించగా, భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యాన్ని అందించారు. ఈ పాట తమిళ వెర్షన్‌ కు సాగర్ సాహిత్యం అందించగా వైష్ణవి కొవ్వూరి, సాగర్ కలసి పాడారు.
 
విష్ణు వర్ధన్, శ్యామ మలయాళ వెర్షన్ ని ఆలపించగా, సిజు తురవూర్ సాహిత్యం అందించారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర రాసిన ఈ పాట కన్నడ వెర్షన్‌ ని సంతోష్ వెంకీ, సంగీత రవిచంద్రనాథ్‌లు ఆలపించారు. సాగర్ సౌత్ మ్యూజిక్ అడ్మినిస్ట్రేటర్ గా వున్నారు.
 
లైగర్ కోసం ఇండియన్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రమోషనల్ మెటిరియల్ తో ఈ చిత్రంపై అంచనాలు మరింత భారీగా పెరుగుతున్నాయి.
 
పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
 
విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
 
హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
 
తారాగణం: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను
 
సాంకేతిక విభాగం: దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా
బ్యానర్లు: పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
డీవోపీ: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామారావు ఆన్ డ్యూటీతో రీ ఎంట్రీ ఇస్తున్న వేణు తొట్టెంపూడి