Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలీవుడ్‌లో కెరియర్ టాలీవుడ్‌లో బిజీ- మధు నంబియార్

Madhu Nambiar
, శనివారం, 9 జులై 2022 (19:24 IST)
Madhu Nambiar
తెలుగులో  సినిమాల్లో  ఏ పాత్ర ఇచ్చినా అందులో పూర్తిగా ఒదిగిపోతూ టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంటున్న నటుడు మధు నంబియార్ తాజాగా తను సైంటిస్ట్ పాత్రలో నటించిన చిత్రం "గంధర్వ". యఎస్‌.కె. ఫిలిమ్స్, ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌ టైన్‌మెంట్ పతాకంపై సందీప్ మాధ‌వ్‌, గాయ్ర‌తి ఆర్‌. సురేష్ జంట‌గా అప్స‌ర్ దర్శకత్వం లో సుభాని ఈ చిత్రాన్ని నిర్మించారు .ఈ నెల 8 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సందర్బంగా ఈ చిత్రంలో సైంటిస్ట్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటుడు మధు నంబియార్ పాత్రికేయ మిత్రులతో మాట్లాడారు.
 
- నాకు చిన్నప్పటి నుండి సినిమాలు అంటే చాలా ఇష్టం.నా మదర్ టంగ్ మలయాళం అయినా నేను పుట్టింది మాత్రం  ఇక్కడే.నేను లా చదువుతున్న టైంలోనే నాకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ రావడంతో ఇండియా మొత్తం జర్నీ చేయడం జరిగింది. 2005 లో వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకొని  లాయర్ గా బార్ కౌన్సిల్ లో న పేరు నమోదు చేసుకొని లాయర్ గా వర్క్ చేయడం జరిగింది.ఆ తరువాత సినిమాలలో నటించాలనే కోరిక నాలో బలంగా ఉండడంతో నా ఫ్రెండ్స్ కూడా సినిమాలలో నటించమని ఎంకరేజ్ చేయడంతో నేను గ్లిట్టర్స్ ఫిలిం అకాడమీ లో ట్రైనింగ్ తీసుకున్నాను.
 
- అయితే అనూహ్యంగా దీపక్ బల్ దేవ్ దర్శకత్వంలో గ్లిట్టర్స్ వారు తీసిన "క్వాబ్ సారె ఝాటే" అను హిందీ మూవీ లో బిజినెస్ మెన్ గా నెగిటివ్ రోల్ లో నటించడం జరిగింది. మొదటి సారి బాలీవుడ్ లో నేను నటించిన ఈ పాత్రకు "IIFA" లో బెస్ట్ సపోర్ట్ యాక్టర్ గా నామినేట్ అవ్వడం విశేషం. ఆ తరువాత నేను వివిధ భాషల్లో నటించడం జరిగింది. తెలుగులో నాకు మంచి గుర్తింపును తీసుకొచ్చిన చంద్ర శేఖర్ ఏలేటి గారి "చెక్" లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మూవీ, దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చిన షాదీ ముబారక్ లో డాక్టర్ గా ,ఆ తరువాత "ఈ కథలో పాత్రలు కల్పితం" లో డి. జి. పి గా, నవీన్ చంద్ర హీరోగా నటించిన మిషన్ 2020 లో పోలీస్ ఆఫిసర్ గా ,నటించిన సినిమాలు నాకు మంచి పేరును తీసుకువచ్చాయి. 
 
- అలాగే కన్నడలో పునీత్ రాజ్ కుమార్ నటించిన యువరత్న, తరువాత మలయాళం లో ఇలా అన్ని బాషలలో సినిమాలు నటించడం జరిగింది. ఇపుడు తాజాగా నేను నటించిన చిత్రం "గంధర్వ". ఇందులో సైంటిస్ట్ గా నటించిన పాత్రకు చాలా మంది నుండి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ మూవీ నన్ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుందని నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ 2022 లో నేను నటించిన  "దర్జా", దుల్కర్ సల్మన్ సినిమా "సీతా రామం"లో అర్మీ ఆఫీసర్ గా చేస్తున్న సినిమా నాకు మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. నేను ఎయిర్ ఫోర్స్ లో చేయడం వలన నాకు ఎక్కువగా పోలీస్ ఆఫీసర్, డిఫెన్స్ , లాయర్, సర్దార్జీ క్యారెక్టర్స్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే కొంతమంది నేను చేసిన పోలీస్ పాత్రలను చూసి ఠాగూర్ లో సర్దార్జీ పోలీస్ పాత్రలో నటించిన నటున్ని మీరు రిసెంబుల్  చేస్తున్నారు అంటుంటే నేను ఆ వ్యాక్యూమ్ ను ఫిల్ చేస్తున్నానేమో అనిపించింది.నేను ఒక తెలుగు సినిమాలే కాకుండా  ఒరియా, భోజ్ పురి, హిందీ, ఇంగ్లీష్ వంటి ఐదు భాషల్లో సినిమాలు చేశాను.
 
- ప్రస్తుతం విజయదేవరకొండ సినిమా "ఖుషి", వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలోని బసవ తారకరామ  బ్యానర్ లో డి  జి. పి గా నటిస్తున్నాను. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో తెలియపరుస్తాను. ఇంతవరకు నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ఇక ముందుకూడా ఇలాగే నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ముగించారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ మధ్య రాజమౌళిగారితో మాట్లాడుతున్నప్పుడు ఇదే చెప్పారు- అక్కినేని నాగార్జున