Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంత‌రిక్షం 9000 KMPH వ‌రుణ్, సంక‌ల్ప్ రెడ్డి ఏం చేసారు..?

వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న తొలి తెలుగు స్పేస్ థ్రిల్ల‌ర్ టైటిల్ ప్ల‌స్ ఫ‌స్ట్ లుక్ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి అంత‌రిక్షం 9000 KMPH టైటిల్ ఖ‌రారు చేసారు. ఇందులో వ‌రుణ్ తేజ్ వ్యోమ‌గామిగా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (20:42 IST)
వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న తొలి తెలుగు స్పేస్ థ్రిల్ల‌ర్ టైటిల్ ప్ల‌స్ ఫ‌స్ట్ లుక్ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి అంత‌రిక్షం 9000 KMPH టైటిల్ ఖ‌రారు చేసారు. ఇందులో వ‌రుణ్ తేజ్ వ్యోమ‌గామిగా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు. హాలీవుడ్‌లోనే ఎక్కువ‌గా వ‌చ్చే స్పేస్ కాన్సెప్టుల‌ను ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీకి తీసుకొస్తున్నాడు ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి. ఈయ‌న గ‌తేడాది ఘాజీ సినిమాతో జాతీయ అవార్డ్ అందుకున్నాడు. మ‌రోసారి కొత్త‌గా ప్ర‌య‌త్నిస్తూ.. అంత‌రిక్షం 9000 KMPH  సినిమాతో వ‌స్తున్నాడు. ఈ చిత్రం కోసం అత్యున్నత సాంకేతిక నిపుణులు ప‌నిచేస్తున్నారు. 
 
హాలీవుడ్ సినిమా గ్రావిటీ త‌ర‌హాలోనే.. అంత‌రిక్షం 9000 KMPH  సినిమాను కూడా జీరో గ్రావిటీ సెట్స్‌లో చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు. దీనికోసం హీరో వ‌రుణ్ తేజ్ కూడా క‌జ‌కిస్థాన్ వెళ్లి ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకుని వ‌చ్చారు. ఈ చిత్రం కోసం హాలీవుడ్ నుంచి ఓ టీంను తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్. వాళ్ల ఆధ్వ‌ర్యంలోనే అద్భుత‌మైన యాక్ష‌న్ ఎపిసోడ్స్ డిజైన్ చేసారు. అదితిరావ్ హైద్రీ, లావ‌ణ్య త్రిపాఠి ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్‌తో క‌లిసి ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. టాలీవుడ్‌లో రూపొందుతోన్న ఈ హాలీవుడ్ త‌ర‌హా చిత్రం అంత‌రిక్షం 9000 KMPH ను డిసెంబ‌ర్ 21న  గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments