Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెంకీ-తమన్నా, వరుణ్ తేజ్-మెహ్రీన్ సినిమా శరవేగంగా...

విక్ట‌రీ వెంకటేష్ - మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేష‌న్లో భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అధినేత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ ఎఫ్ 2. ఇ

Advertiesment
వెంకీ-తమన్నా, వరుణ్ తేజ్-మెహ్రీన్ సినిమా శరవేగంగా...
, శనివారం, 21 జులై 2018 (17:32 IST)
విక్ట‌రీ వెంకటేష్ - మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేష‌న్లో భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అధినేత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ ఎఫ్ 2. ఇటీవ‌ల ఈ సినిమా ప్రారంభ‌మైంది.   సక్సెస్ ఫుల్‌గా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్లో వెంకీ, వరుణ్‌తో పాటు వీరిద్దరి సరసన హీరోయిన్స్‌గా నటిస్తున్న తమన్నా, మెహరీన్ కౌర్ కాంబినేషన్లో హిలేరియస్ సీక్వెన్సెస్‌ని అనిల్ రావిపూడి తెర‌కెక్కించారు.
 
ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో ఫోటోస్ షేర్ చేశాడు. అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ప‌టాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలు స‌క్స‌స్ సాధించ‌డంతో ఈ మూవీ కూడా ఖ‌చ్చితంగా స‌క్స‌స్ సాధిస్తుంద‌నే టాక్ ఉంది. ఈ సినిమా క‌థ ఏంటి అనేది మాత్రం బ‌య‌ట‌కు రాలేదు. దీంతో అస‌లు ఈ సినిమా క‌థ ఏంటి అనేది ఆస‌క్తిగా మారింది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ మూవీని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీరభోగ వసంతరాయలు'లో శ్రియ కల్ట్ లుక్..!