Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''అంతరిక్షం''లో వరుణ్ తేజ్ లుక్‌కు ప్రేక్షకులు ఫిదా..

గత ఏడాది ఫిదాతో అందరినీ ఆకట్టుకున్న వరుణ్ తేజ్.. ఆ తర్వాత తొలిప్రేమ సినిమాతో సక్సెస్ సాధించాడు. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ ఓ మూవీ చేస

Advertiesment
''అంతరిక్షం''లో వరుణ్ తేజ్ లుక్‌కు ప్రేక్షకులు ఫిదా..
, బుధవారం, 15 ఆగస్టు 2018 (14:06 IST)
గత ఏడాది ఫిదాతో అందరినీ ఆకట్టుకున్న వరుణ్ తేజ్.. ఆ తర్వాత తొలిప్రేమ సినిమాతో సక్సెస్ సాధించాడు. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ ఓ మూవీ చేస్తున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆగస్టు 15 స్వాతంత్ర్ర్య దినోత్సవ కానుకగా ఈ మూవీ టైటిల్‌ ''అంతరిక్షం'' అంటూ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసారు. మన దేశానికి చెందిన అస్ట్రోనాట్‌‌గా అంతరిక్షంలో శాటిలైట్‌కు దగ్గరగా సంచరిస్తున్న వరుణ్ తేజ్ లుక్ ఆకట్టుకుంటోంది. 
 
ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయి సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నారు. అంతరిక్షం ఎఫెక్ట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన సెట్స్‌లో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆదితిరావ్ హైదరితో పాటు లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వాతంత్ర్యదినోత్సవం.. మాస్ మహారాజా కాన్సెప్ట్ పోస్టర్ వచ్చేసింది..