వరుణ్‌తో చుక్కలతో డ్యాన్స్ చేద్దాం అంటున్న అదితి రావు హైదరీ...
'చందమామను వెంటాడదాం.. చుక్కలతో డ్యాన్స్ చేద్దాం.. చంద్రుడిపై మట్టి తీసి తోటి ప్రయాణికులపై చల్లుదాం' అంటున్న అదితిరావు హైదరి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ స్పేస
'చందమామను వెంటాడదాం.. చుక్కలతో డ్యాన్స్ చేద్దాం.. చంద్రుడిపై మట్టి తీసి తోటి ప్రయాణికులపై చల్లుదాం' అంటున్న అదితిరావు హైదరి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ స్పేస్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో వరుణ్ సరసన అదితిరావు హైదరి, లావణ్య త్రిపాఠిలు నటిస్తున్నారు. ఇందులో వరుణ్, అదితిరావులు వ్యోమగాములుగా నటిస్తున్నారు.
ఇటీవల ఈ అమ్మడు తన ట్విట్టర్‌లో వరుణ్ తేజ్‌తో కలిసి దిగిన ఫోటో షేర్ చేసింది. ఇందులో స్పేస్ సూట్ వేసుకొని ఉన్నారు ఇద్దరు. ఆ ఫోటోకి 'చందమామను వెంటాడదాం.. చుక్కలతో డ్యాన్స్ చేద్దాం.. చంద్రుడిపై మట్టి తీసి తోటి ప్రయాణికులపై చల్లుదాం' అంటూ ఫన్నీగా కామెంట్ యాడ్ చేసింది. ఇక తాజాగా తరగతి గదిలో దిగిన ఫోటో షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తమిళనాడులోని రామేశ్వరంలో జరుగుతోంది. భారతరత్న ఏపీజే అబ్దుల్‌కలాం చదివిన పాఠశాలలో, ఆయన చదివిన తరగతిలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చదివిన చోటు తెలుగు సినిమా చిత్రీకరణ జరగడం మనకు గర్వకారణం అంటూ షూటింగ్ గ్యాప్‌లో దిగిన ఫొటోని కథానాయిక అదితీరావ్ హైదరి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తోంది.
అయితే, ఘాజీ చిత్రంతో దర్శకుడు సంకల్ప్ రెడ్డి జాతీయ స్థాయిలో మంచి పేరు, గుర్తింపు సంపాదించుకున్నారు. ఇపుడు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్‌ని ఎంపిక చేశాడు. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు.