Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌ కొండపొలం నుంచి -ఓబులమ్మ- పాట విడుదల

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (18:17 IST)
Rakul-Vaishnav Tej
వైష్ణ‌వ్ తేజ్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ‘కొండ‌పొలం’. రీసెంట్‌గా విడుద‌లైన వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. శుక్రవారం ఈ చిత్రం నుంచి ‘ఓబుల‌మ్మ‌...’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
 
సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీర‌వాణి శ్రావ్య‌మైన బీట్‌ను అద్బుత‌మైన పాట‌ను అందించారు. మ‌మ‌త‌ల త‌ల్లి.. పాట పాడిన సింగ‌ర్ స‌త్య యామిని, పి.వి.ఎన్.ఎస్‌.రోహిత్ ఈ పాట‌ను పాడ‌టంతో పాట‌ను వింటున్న కొద్ది మ‌రింత గొప్ప‌గా అనిపిస్తుంది.
 
సంగీత ద‌ర్శ‌కుడిగానే కాదు, రైట‌ర్‌గానూ ఎం.ఎం.కీరవాణి స‌రికొత్త ప‌దాల‌తో రాయ‌ల‌సీమ యాస‌లో ఈ పాట‌ను రాయ‌డం విశేషం. పాట‌లో వ్య‌క్త‌ప‌రిచిన భావాలు ఆలోచ‌నాత్మ‌కంగా ఉన్నాయి. పాట‌కు త‌గ్గ‌ట్లు వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ జోడీ మ‌ధ్య రొమాన్స్ బ్యూటీఫుల్‌గా ఉంది. మాస్ లుక్ గ‌డ్డంతో వైష్ణ‌వ్ తేజ్‌, గ్రామీణ అమ్మాయిగా ర‌కుల్ ప్రీత్ జోడీ ఓ ఫ్రెష్ లుక్ తీసుకొచ్చింది.
 
జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ సినిమాలో ప్ర‌తి ప్రేమ్ కంటికి ఇంపుగా కనిపిస్తుంది. అడ‌వి, ప‌ల్లెలోని ప్ర‌తి లొకేష‌న్‌ను సినిమాటోగ్రాప‌ర్ త‌న కెమెరా ఓ అంద‌మైన దృశ్యంగా ఆవిష్క‌రించారని తెలుస్తుంది.
 
ఈ బ్యూటీఫుల్ సాంగ్‌ను భాను కొరియోగ్ర‌ఫీ చేశారు. క‌చ్చితంగా ఈ పాట శ్రోత‌ల‌కు చాలా కాలం గుర్తుండిపోతుంది. సినిమా మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్స్‌కు ఇదొక మంచి ప్రారంభం అని చెప్ప‌వ‌చ్చు. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.8గా రూపొందిన అడ్వెంచ‌ర‌స్ మూవీ `కొండ పొలం`కు స‌న్న‌పురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన నవల ఆధారం. బిబో శ్రీనివాస్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయిబాబు జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రంలో మ‌రికొంత ప్ర‌ముఖ ఆర్టిస్టులు న‌టించారు. `ఎపిక్ టేల్ ఆఫ్ బిక‌మింగ్‌` అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతోన్న `కొండ‌పొలం` చిత్రాన్ని అక్టోబ‌ర్ 8న విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో కుప్పకూలిపోయిన యువకుడు.. ఆ తర్వాత?

Google: భర్తను హత్య చేసి తప్పించుకోవడం ఎలా.. గూగుల్‌ను అడిగిన భార్య!

Mumbai monorail breakdown: ముంబై మోనోరైలులో చిక్కుకున్న 582 మంది సేఫ్

ఏపీలో స్త్రీ శక్తి పథకం.. త్వరలోనే క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్మార్ట్‌ కార్డులు

దువ్వాడ, మాధురి పబ్లిక్‌గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments