Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాకు అభిమానుల ప్రేమ ఆద‌ర‌ణ గొప్ప ఎన‌ర్జీ: మెగాస్టార్ చిరంజీవి

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (18:01 IST)
Fan with chiru
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు ఆగ‌స్టు 22న జ‌రిగింది. ఈ వేడుక‌ల్లో ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపేందుకు తిరుప‌తి అలిపిరి నుంచి ఒక వీరాభిమాని సైకిల్ యాత్ర చేప‌ట్టి 12రోజులు ప్ర‌యాణించ‌డం ఆశ్చ‌ర్య‌పరిచింది. ఈ సంద‌ర్భంగా చిరంజీవి త‌న‌ను క‌లిసేందుకు అభిమానికి అంత శ‌క్తి ఎలా వ‌చ్చిందో అంటూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ సాహ‌సం స‌రికాద‌ని వారించారు.
 
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ-``నా అభిమాని ఎన్. ఈశ్వ‌ర‌య్యా బ‌లుజుప‌ల్లి గ్రామం నుంచి వ‌చ్చాడు. తిరుప‌తి (అలిపిరి) నుంచి అత‌డు సైకిల్ పై ప్ర‌యాణం ప్రారంభించాడు. నా పుట్టిన‌రోజు కోసం అత‌డు సైకిల్ యాత్రను చేప‌ట్టి వ‌చ్చి క‌లిసాడు. నా ఆరాధ్య దైవం ఆంజ‌నేయ స్వామి మాల‌ను ధ‌రించి స్వామి ఆశీస్సులు మాకు ఉండాల‌ని కోరుకున్నారు. మేం ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ఆలోచిస్తూ వ‌చ్చారు. ఆగ‌స్టు 10న‌ బ‌య‌ల్దేరి 12 రోజుల పాటు సైకిల్ యాత్ర చేసుకుంటూ అలిపిరి నుంచి వ‌చ్చాడు ఈ అభిమాని. చాలా సంద‌ర్భాల్లో చెప్పాను. 

Fan with pavan
మాకు అభిమానుల ప్రేమ ఆద‌ర‌ణ గొప్ప ఎన‌ర్జీ. ఇలాంటి అభిమానుల మంచి మ‌న‌సు ఆశీస్సులతోనే మేం బావుంటాం. వారు మా గురించి ఆలోచించిన‌ట్టే మేం కూడా వారు వారి కుటుంబ స‌భ్యులు బావుండాల‌ని కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలియ‌జేస్తున్నాను అని అన్నారు. అలాగే త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ని క‌ల‌వాల‌ని అడిగిన ఆ అభిమానికి క‌లిసేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేశారు మెగాస్టార్ చిరంజీవి.
వెంటనే ఆ వీరాభిమాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని కలవటం జరిగింది ఇక తన ఆనందానికి అవధులు లేదనే చెప్పాలి. తన జన్మ ధన్యమైంది అంటూ.. పన్నెండు రోజుల సైకిల్ ప్రయాణాన్ని వీరిని కలిసిన ఒకరోజులో మర్చిపోయేలా చేసారు మెగాస్టార్ చిరంజీవిగారు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు అంటున్నాడు ఆ వీరాభిమాని.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్

చక్రం తిప్పిన పవర్ స్టార్.. ఆయన వల్లే గెలిచానన్న దేవేంద్ర బహిరంగ ప్రకటన (video)

జగన్‌ హయాంలో భూ ఆక్రమణలు.. వదిలిపెట్టేది లేదన్న పవన్ కల్యాణ్

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments