Webdunia - Bharat's app for daily news and videos

Install App

వసూళ్ల ''ఉప్పెన'' ఖాయమా.. ప్రి రిలీజ్ అదిరిందిగా!

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (16:28 IST)
మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెన విడుదలకు ముందే సంచలనాలు రేపుతుంది. విడుదలైన తర్వాత సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో తెలియదు కానీ ముందుగానే బిజినెస్ విషయంలో మాత్రం దుమ్ము దులిపేస్తుంది. ముఖ్యంగా ఏరియాల వైజ్‌గా కూడా ఉప్పెన అన్ని చోట్లా అదిరిపోయే బిజినెస్ చేసింది. నైజాం, సీడెడ్, కోస్తాంధ్రా అన్ని చోట్ల కూడా ఉప్పెనకు మంచి బిజినెస్ జరిగింది. దాంతో దర్శక నిర్మాతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
 
2021లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఉప్పెనదే హైయ్యస్ట్. రవితేజ సంక్రాంతి బ్లాక్ బస్టర్ క్రాక్ సినిమా బిజినెస్‌ను కూడా క్రాస్ చేసింది ఉప్పెన చిత్రం. ఫిబ్రవరి 12న వాలెంటైన్ డే వీకెండ్ కానుకగా విడుదల కానుంది ఉప్పెన. పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా వసూళ్ల ఉప్పెన రావడం ఖాయంగా కనిపిస్తుంది. 
 
ఈ సినిమాకు 22 కోట్ల బిజినెస్ జరిగింది. ఫిబ్రవరి లాంటి అన్ సీజన్‌లో 22 కోట్ల షేర్ వసూలు చేయడం అంత సులభం కాదు. కానీ పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా లక్ష్యం చేరుకుంటాననే ధీమాతో కనిపిస్తున్నాడు వైష్ణవ్ తేజ్. 
 
ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోయిన్ తండ్రిగా నటించాడు. కృతి శెట్టి హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతుంది. విజయ్ ఉండటంతో తమిళంలో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అక్కడ కూడా మంచి వసూళ్లు రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఉప్పెన ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments