హీరోలంతా ఒకరిపై ఒకరికి పడదు అనేది పాతకాలపు మాట. కానీ నేడు జనరేషన్ మారిన కొద్దీ వారంతా ఒక్కటే అయిపోతున్నారు. స్నేహితులుగా మెలుగుతూ సినిమాల గురించే చర్చించుకుంటున్నారు. ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ కలిసి ఆర్.ఆర్.ఆర్. చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మిగిలిన హీరోలు కూడా.
లేటెస్ట్‌గా చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్‌తేజ్ హీరోగా మారాడు. ముందు దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో సినిమా రూపొందింది. కానీ ఈలోగా `ఉప్పెన` అనే సినిమా చేశాడు. అది విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్‌లో వైష్ణవ్ ఫొటోలు చూసి ఎన్.టి.ఆర్. ఆశ్చర్యపోయాడు. వెంటన్ వైష్ణవ్‌కు ఫోన్‌చేసి `నన్ను ఎన్.టి.ఆర్. అంటారు` అని చెప్పగానే వైష్ణవ్ ఉబ్బి తబ్బియ్యాడు.
మీరేంటి సార్. నాకు ఫోన్ చేయడమేంటి అని ఆశ్చర్యపడుతూనే.. ఆయన చెప్పిందంతా విని కలిశాడు. అది కూడా రామ్‌చరణ్ ఇంటిలోనే. వైష్ణవ్ మాటల్లో చెప్పాలంటే.. ఎన్.టి.ఆర్.గారు నన్ను ప్రోత్సహించిన విధానాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. నేను రామ్ చరణ్ ఇంట్లో ఎన్టీఆర్ అన్నను కలిశాను. అప్పటి నుండి, ఆయన నన్ను తన సొంత సోదరుడిగానే ప్రేమించారు. ఆయన ఎల్లప్పుడూ నన్ను పిలిచి, నా షూటింగ్, నా భవిష్యత్తు సినిమాల గురించి ఆరా తీస్తారు.
అలాగే మంచు మనోజ్ కూడా మంచి స్నేహితుడు. తను కూడా అప్పుడు రావాల్సింది. కానీ చేతికి గాయం కావడంతో రాలేకపోయాడు. సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ కూడా మంచి ప్రెండ్. మేమంతా తరచూ కలుస్తుంటాం. జిమ్‌లకు వెళుతుంటామని చెప్పారు. నేను మిలట్రీలోకి వెళ్ళాలనుకున్నా. కానీ కుదరలేదు. ఆ తర్వాత హీరో అయ్యాక ఇంతమంది మంచి వారితో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా వుందని వైష్ణవ్ చెబుతున్నాడు. వైష్ణవ్ నటించిన `ఉప్పెన` ఈ నెల 12న విడుదల కాబోతుంది.