Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాదీ అమ్మాయి.. సినీ నటి కీర్తి సురేష్‌కు కూడా..?

Advertiesment
ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాదీ అమ్మాయి.. సినీ నటి కీర్తి సురేష్‌కు కూడా..?
, శనివారం, 6 ఫిబ్రవరి 2021 (17:36 IST)
Kotta Keerthi Reddy
హైదరాబాద్‌కు చెందిన మరో అమ్మాయి అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. ప్రఖ్యాత ఫోర్బ్స్‌ పత్రిక తాజాగా ప్రకటించిన ‘30 అండర్‌ 30’లో ఈసారి మహిళల హవా కనిపించింది. అందులోనూ హైదరాబాద్‌‌కు చెందిన తెలుగు అమ్మాయి కీర్తి రెడ్డి కొత్త (24)కు సైతం చోటు దక్కింది. 30 ఏళ్లలోపు వేర్వేరు రంగాల్లో విశిష్ట సేవలందిస్తూ.. రాణించిన 30 మంది జాబితాను ఏటా ఫోర్బ్స్‌ ప్రకటిస్తోంది. 
 
ఇందులో భాగంగా ‘స్టాట్విగ్‌’ అనే బ్లాక్‌చైన్‌ సాంకేతికత ఆధారిత వ్యాక్సిన్‌ సరఫరా నిర్వహణ ప్లాట్‌ఫాంకు సహ వ్యవస్థాపకురాలు, సీఓఓగా కీర్తి రెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు విశేష క‌ృషీ చేసినందుకు కీర్తిరెడ్డి తొలి మంది జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.
 
హైదరాబాద్‌కు చెందిన కీర్తి రెడ్డి కొత్త… ద లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పొలిటికల్‌సైన్స్‌ నుంచి మేనేజ్‌మెంట్‌లో గ్లోబల్‌ మాస్టర్స్‌ పట్టాను సాధించారు. కరోనా వ్యాక్సిన్‌ అలాగే, ఆహారం ద్వారా వచ్చే వృధాను అరికట్టేందుకు అవసరమైన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కీర్తిరెడ్డి పనిచేస్తున్నారు. 
webdunia
keerty suresh


అనతికాలంలోనే గొప్ప ఖ్యాతి గడిచిన కీర్తిరెడ్డి ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు. కాగా ఈ జాబితాలో ప్రముఖ సినీ నటి కీర్తి సురేశ్ కూడా స్థానం సంపాదించుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమకు అడ్డుగా వుందని ఎంత పనిచేశాడు.. చెన్నైలో దారుణం