Publish Date: Fri, 05 Feb 2021 (12:06 IST)
Updated Date: Fri, 05 Feb 2021 (12:30 IST)
తెలంగాణ రాష్ట్రంలో గురువారం రాత్రి 8గంటల వరకు 37,387 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 177 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,95,270కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,607కి చేరింది.
కరోనాబారి నుంచి గురువారం 189 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,91,699కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1964 ఉండగా వీరిలో 780 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనాపరీక్షల సంఖ్య 80,34,038కి చేరింది.