Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దర్శకుంతా ‘ఉప్పెన’ చూసి స్క్రీన్‌ప్లే నేర్చుకోవాలి: మెగాస్టార్ చిరంజీవి

దర్శకుంతా ‘ఉప్పెన’ చూసి స్క్రీన్‌ప్లే నేర్చుకోవాలి: మెగాస్టార్ చిరంజీవి
, శనివారం, 6 ఫిబ్రవరి 2021 (22:51 IST)
Chiranjeevi, Upeena pre-release
స్క్రీన్‌ప్లేకు సరైన నిదర్శనం చెప్పాంటే అనుకున్న కథను తెరపై చూపించగల‌గ‌డ‌మే. ప్రేక్షకుడిలో ఆసక్తి, ఉత్కంఠ ఎలా చూపించాల‌ని చెప్పేది స్క్రీన్‌ప్లే. చాలామంది  దర్శకుల‌కు ఇది తెలియకపోవచ్చు. కానీ ఈ సినిమాను చూసి స్క్రీన్‌ప్లే నేర్చుకోవాల‌ని’’ మెగాస్టార్‌ సంచల‌న వ్యాఖ్య చేశారు.
 
వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా సుకుమార్‌ శిష్యుడు బుజ్జిబాబు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉప్పెన’. మైత్రీమూవీస్‌ బేనర్‌లో నవీన్‌, రవి నిర్మించారు. ఈ నెల 12న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెషన్‌లో ప్రీరిలీజ్‌ ఏర్పాటు చేశారు. దీనికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 
ఆయన మాట్లాడుతూ.. ఉప్పెన సినిమా చూశాక ఎంతో బాగుందని మీడియా ముందుకు వచ్చి చెప్పాలనుకున్నాను. కానీ బలవంతంగా ఆపుకున్నా. ఇదొక దృశ్యకావ్యం. సుకుమార్‌తో బుచ్చిబాబు వచ్చి కథ చెప్పాడు. ఏమైనా మార్పు చేయమన్నారు. అవసరం లేకుండా చక్కగా చెప్పారు. ఇది ఫక్తు మట్టికథ. మన విలేజ్‌ కథ. 80లో భారతీరాజా కథలు గుర్తుకువచ్చాయి. మనమంతా కథలు ఎక్కడికో తీసుకెళుతున్నాం. మన కథలు రావాలి. మైత్రీమూవీస్‌కు మరో రంగస్థం అవుతుందని చెప్పగల‌ను.

ఇక విజయ్‌సేతుపతి నటిస్తేనే ఈ సినిమా సక్సెస్‌ అన్నాను. ఆయన బిజీగా వున్నా డేట్స్‌ ఇచ్చి సపోర్ట్‌ చేశారు. ఇక వైష్ణవ్‌ తేజ్ బాల‌నటుడిగా కూడా శంకర్‌దాదా జిందాబాద్‌లో కుర్చీలో కూర్చుని వున్న పాత్ర చేశాడు. కృతిశెట్టి క్లైమాక్స్‌ను స్వీప్‌ చేసింది. స్టార్‌గా ఎదిగే ల‌క్ష‌ణాలు వున్నాయి. అందుకు నిదర్శనమే ఇప్పటికే మూడు సినిమాల్లో బుక్‌ అయింది. డి.ఎస్‌.పి. అద్భుతమైన బాణీలు, పాట కూడా పాడాడు. ఇలా అందరూ కష్టపడి పనిచేశారు. ప్రేక్షకులు ఆదరించండి’’ అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షాకింగ్, రెడ్ లైట్ ఏరియాలో శ్వేతా బసు ప్రసాద్