Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోన్న 'ఆచార్య' టీజర్‌, మే 13న గ్రాండ్‌ రిలీజ్‌

Advertiesment
సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోన్న 'ఆచార్య' టీజర్‌, మే 13న గ్రాండ్‌ రిలీజ్‌
, శుక్రవారం, 29 జనవరి 2021 (17:58 IST)
Chiranjeevi, Acharya
ఆచార్య దేవో భవ' అని మన అందరికీ తెలిసిందే.. కానీ 'ఆచార్య రక్షోభవ' అని అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. అసలు మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య గురించి అంత బలంగా ఎందుకు చెబుతున్నారు. అనే విషయం తెలియాలంటే 'ఆచార్య' సినిమా చూడాల్సిందేనని అంటోంది చిత్ర యూనిట్‌. మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'ఆచార్య'. స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో  కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను జనవరి 29, శుక్రవారం విడుదల చేశారు. టీజర్‌కు మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ను అందించారు. ఆచార్య పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి, సిద్ధ అనే మరో పవర్‌ఫుల్‌ పాత్రలో మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తుండటంతో సినిమా ఎలా ఉంటుందోనని అందరిలో ఆసక్తి పెరిగింది. ఇక చిరంజీవి, చరణ్‌ కాంబినేషన్‌ను వెండితెరపై వీక్షించడానికి  మెగాభిమానులు సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 
 
'ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం. మరి అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే, ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా, అందరూ ఎందుకు ఆచార్య అని అంటుంటారు,  బహుశా గుణపాఠాలు చెబుతాననేమో' అనే పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌తో మెగాస్టార్‌ చిరంజీవి ధర్మస్థలిలో ధర్మ సంరక్షణార్థం ఆచార్యగా ఏం చేశాడనే విషయాలను యాక్షన్‌ ప్యాక్‌డ్ ఆచార్య టీజర్‌లో చూపించారు. టీజర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆచార్య దేవోభవ.. ఆచార్య రక్షోభవ అనే స్లోగన్‌ వినిపిస్తుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం పెద్ద ఎసెట్‌గా నిలుస్తోంది. 
 
ప్రస్తుతం 'ఆచార్య' సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన కోకాపేటలో వేసిన భారీ టెంపుల్‌ సెట్‌ను ఈ టీజర్‌లో మనం చూడొచ్చు. ఇండియాలో అతి పెద్ద భారీ టెంపుల్‌ సెట్‌ ఇది. ఈ సినిమాను మే 13న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఎస్‌.తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జులై 2న అడివిశేష్ `మేజ‌ర్‌`