టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

ఠాగూర్
శుక్రవారం, 31 జనవరి 2025 (09:14 IST)
టాలీవుడ్ సినీ నిర్మాత వేదరాజు టింబర్ ఇకలేరు. ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు వయసు 54 సంవత్సరాలు. హీరో అల్లరి నరేష్‌‍తో ‘మడత కాజా‘, ‘సంఘర్షణ‘ వంటి  చిత్రాలను నిర్మించారు. సినిమాలపై ఇష్టంతో ఓ వైపు నిర్మాణ రంగంలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలను నిర్మించిన నిర్మాత వేదరాజు టింబర్. త్వరలో మరో చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలోనే ఈ విషాదకర సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 
 
గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యంతో హైదరాబాద్ నగరంలోని ఏఐజీ హాస్పిటల్‌లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే కోలుకుని వస్తారు అని సన్నిహితులు, కుటుంబ సభ్యులు భావిస్తున్న తరుణంలో ఇలా జరగటం వారందరిలో విషాదాన్ని నింపింది. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. అంత్య క్రియలు శుక్రవారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments