తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

ఠాగూర్
గురువారం, 30 జనవరి 2025 (20:01 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఒక్కసారిగా వెలుగుచూసిన మత్తుకళ్ళ సుందరి మోనాలిసాకు బాలీవుడ్ సినిమాలో నటించే అరుదైన ఛాన్స్ లభించింది. ఆమెకు బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా మూవీ ఛాన్స్ ఇచ్చారు. తాను దర్శకత్వం వహించే ‘ది డైరీ ఆఫ్‌ మణిపూర్‌’ సినిమాలో మోనాలిసాను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ మేరకు మోనాలిసా తన తొలి చిత్రానికి సంతకం చేశారు. 
 
తాజాగా ఈ విషయంపై చర్చించేందుకు స్వయంగా మోనాలిసా ఇంటికి దర్శకుడు స్వయంగా వెళ్లారు. సనోజ్ మిశ్రా ఆఫర్ చేసిన సినిమాలో నటించేందుకు అంగీకారపత్రంపై మోనాలిసా సంతకం చేశారు. ఈ సినిమా షూటింగ్‌కు ముందు ముంబైలో మోనాలిసాకు యాక్టింగ్ నేర్పించనున్నట్లు సమాచారం. 
 
కాగా, మోనాలిసా భోస్లే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా జీవితాన్నే మార్చేసింది. మొన్నటివరకు సాధారణ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్న ఈ 16 ఏళ్ల మోనాలిసా.. కొన్ని రోజుల వ్యవధిలోనే ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారు. కుంభమేళాలో పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకుని జీవితం సాగించే మోనాలిసా ఇప్పుడు.. తెరపై కనిపించనుంది. దీనంతటికీ కారణం సోషల్ మీడియానే. 
 
కుంభమేళాకు వెళ్లిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌.. మోనాలిసాతో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అయింది. దీంతో రాత్రికి రాత్రే ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సోషల్ మీడియా ఎక్కడ చూసినా మోనాలిసా ఫోటోలు, వీడియోలే వైరల్ అవుతున్నాయి. దీంతో బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. తాను తీయబోయే తర్వాతి సినిమాలో మోనాలిసాకు అవకాశం ఇచ్చారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments