Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుష్ప-3లో జాన్వీ కపూర్ ఐటెమ్ సాంగ్ చేస్తే అదిరిపోద్ది.. డీఎస్పీ

Advertiesment
Jhanvi Kapoor

సెల్వి

, శుక్రవారం, 24 జనవరి 2025 (12:06 IST)
Jhanvi Kapoor
అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప-2 చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేస్తూ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దాని ముఖ్యాంశాలలో శ్రీలీల ప్రదర్శించిన ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఐటెం సాంగ్ కిస్సిక్ ఒకటి.
 
పుష్ప-3 గురించి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పుష్ప 3లోని ఐటెం సాంగ్‌కు జాన్వీ కపూర్ అద్భుతమైన ఎంపిక అవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
 
"కిస్సిక్ లాంటి పాటలో ప్రదర్శన ఇచ్చే ఎవరైనా అంతర్జాతీయ ఖ్యాతిని పొందే అవకాశం ఉంది" అని డీఎస్పీ అన్నారు. పుష్ప2లో శ్రీలీలను తీసుకోమని తానే చెప్పానన్నారు. శ్రీలీల డ్యాన్స్ ఆ పాటకు ప్లస్ అయ్యిందన్నారు. 
 
సమంతా రూత్ ప్రభు, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, శ్రీలీల వంటి పలువురు ప్రముఖ నటీమణులు తమ కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో ఐటెం సాంగ్స్‌లో ప్రదర్శన ఇచ్చారని డీఎస్పీ గుర్తు చేశారు. 
 
ఇంకా సాయి పల్లవి డ్యాన్స్‌పై కూడా డీఎస్పీ ప్రశంసలు గుప్పించారు. అలాగే జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవికి ఉన్నంత గొప్పతనాన్ని కలిగి ఉందని డీఎస్పీ తెలిపారు. దీని వల్లే పుష్ప 3లో రాబోయే ఐటెం సాంగ్‌కు ఆమెను తీసుకోవాలన్నారు. 
webdunia
Jhanvi Kapoor


ఐటెం సాంగ్స్ విజయంలో డ్యాన్స్ కీలక పాత్ర పోషిస్తుందని డీఎస్పీ అన్నారు. అలా జాన్వీ కపూర్ పుష్ప-3లో స్పెషల్ సాంగ్ చేస్తే తప్పకుండా ఆ మూవీకి హైలైట్ అవుతుందని ఆయన వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ నిర్మాతల గృహాల్లో ముగిసిన ఐటీ సోదాలు...