Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌ని షేక్ చేసిన‌ డ్ర‌గ్స్ కేస్ - ఇంత‌కీ.. చార్జిషీటులో ఉన్న సెల‌బ్రిటీలు ఎవ‌రు..?

Webdunia
బుధవారం, 15 మే 2019 (21:39 IST)
టాలీవుడ్‌ని షేక్ చేసిన‌ డ్రగ్స్ కేసు గురించి అందరికీ తెలిసిందే. డైరెక్టర్ పూరి జగన్నాథ్, శ్యామ్ కే. నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరో తరుణ్, హీరో నవదీప్, హీరోయిన్ ఛార్మీ కౌర్, ముమైత్ ఖాన్, హీరో రవితేజ, శ్రీనివాస్ (రవితేజ కారు డ్రైవర్), హీరో తనీష్, హీరో నందుతో పాటు పలువురు ప్రముఖులను సిట్ అధికారులు విచారించారు.
 
అంతేకాకుండా... సిట్ అధికారులు విచార‌ణ‌కు హాజ‌రైన కొంతమంది సినీ ప్ర‌ముఖుల‌ గోర్లు, వెంట్రుకల శాంపిల్స్‌ సేకరించి వారి వాంగ్మూలాన్ని సైతం సిట్ టీమ్ నమోదు చేసింది. కాగా ఈ వ్యవహారంలో అప్పట్లో సిట్ అధికారులు 12 కేసులను నమోదు చేశారు. రెండేళ్ల తర్వాత మరోసారి డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూసింది. ఈ కేసులో ఉన్నవారంతా నిందితులు కాదు.. బాధితులే అని సెలబ్రిటీలపై సిట్ రిపోర్ట్ బయటికొచ్చింది.
 
డ్రగ్స్ కేసు గురించి సమాచార హక్కు చట్టం ద్వారా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వివరాలు బయటపెట్టింది. సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లలో సినీ సెలబ్రిటీల పేర్లు లేక‌పోవ‌డంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. డ్రగ్స్‌ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ కేసులో సిట్ 4 చార్జిషీట్లను దాఖలు చేసినట్టు సమాచారం. ఈ నాలుగు చార్జిషీట్ల‌లో ఒకటి సౌత్ ఆఫ్రికా పౌరుడు రఫెల్ అలెక్స్ విక్టర్‌పై ఉంది. ముంబై నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌ను తరలించి విక్రయిస్తున్నాడని 2017 ఆగస్టులో అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

వైఎస్సార్‌సీపీది అత్యంత నీచమైన పాలన.. నారా లోకేష్ ఫైర్

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments