Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''అల్లరి''లో నా పేరు రవి.. ''మహర్షి''లోనూ నా పేరు రవి.. నరేష్ ట్వీట్

Advertiesment
''అల్లరి''లో నా పేరు రవి.. ''మహర్షి''లోనూ నా పేరు రవి.. నరేష్ ట్వీట్
, శుక్రవారం, 10 మే 2019 (16:47 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా మహర్షి.. మే 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్‌తో పాటు అల్లరి నరేష్ నటన ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. చాలాకాలం తర్వాత నరేష్‌ని ఇలాంటి క్యారెక్టర్‌‌లో చూడడం ప్రేక్షకులకు కొత్త అనుభూతి నిచ్చింది. 
 
మహర్షిలో రిషితో పాటు రవి కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్. సినిమా చూశాక అతని క్యారెక్టర్ కూడా సినిమాలో కీలకం అయ్యింది. ఈ సందర్భంగా అల్లరి నరేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
17 సంవత్సరాల క్రితం ఒక యువకుడు అందరిలానే తన గమ్యాన్ని వెతుక్కుంటున్నాడు.. సినిమా పరిశ్రమలో నిలబడ గలడా, లేడా అనే విషయం కూడా అప్పుడతనికి తెలీదు.. కానీ, పట్టుబట్టి మరీ తన మనసు ఏం చెప్పిందో అదే విన్నాడు.. 2002 మే 10న ఆ కుర్రాడు 'అల్లరి నరేష్‌'గా మరోసారి పుట్టాడు. అల్లరి సినిమా ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేసేలా చేసింది.
 
చూడడానికి అందంగా లేని నన్ను ప్రేక్షకులు ఆదరించినందుకు తానెప్పుడూ వారికి రుణపడి ఉంటాను. ఇప్పుడెందుకీ విషయం చెబుతున్నాను, ఇండస్ట్రీలోకి వచ్చి 17 ఏళ్ళు అయిన తర్వాత ఎందుకిలా మాట్లాడుతున్నాను అంటే, దానికి కారణం 'రవి'.. అల్లరి సినిమాలో తన క్యారెక్టర్ పేరు 'రవి', మహర్షిలోనూ 'రవి'నే.. ఈ 55 సినిమాల తన ప్రయాణం.. తన జీవితంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలను నింపిందన్నాడు. తను ఎదుగుదలకు కారణమైన చిత్ర పరిశ్రమకు.. తనపై నమ్మకం వుంచిన నిర్మాతలు, దర్శకులకు, సాంకేతిక సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదులు తెలుపుకుంటున్నానని అల్లరి నరేష్ చెప్పుకొచ్చాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాట పాడుతానంటే, రా... రాత్రంతా నాతో పడుకో అన్నాడు... సింగర్ ప్రణవి