Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహ భర్తకు షాకిచ్చిన విద్యుత్ బోర్డు.. ఎలాగంటే?

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (11:03 IST)
తమిళనాడు విద్యుత్ బోర్డు తమిళనటుడు ప్రసన్నకు షాకిచ్చింది. ప్రముఖ సినీ నటి స్నేహ భర్త అయిన ప్రసన్నకు ఒక నెలకు ఏకంగా రూ.70 వేల బిల్లు పంపి విస్తుపోయేలా చేసింది. ప్రసన్న, ఆయన తండ్రి, మామగారి ఇళ్లకు మొత్తంగా రూ. 70 వేల బిల్లు పంపిన బోర్డు.. వెంటనే చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది. బిల్లు చూసి షాకైన ప్రసన్న విద్యుత్ బోర్డుపై మండిపడ్డారు. 
 
తానైతే రూ. 70 వేలు చెల్లించగలనని, కానీ ఇదే బిల్లు పేదల ఇంటికి వస్తే పరిస్థితి ఏమిటని ప్రసన్న ప్రశ్నించారు. నిజానికి తమకు రెండు నెలలకు కూడా ఇంత బిల్లు రాదని, సాధారణంగా వచ్చే బిల్లుకు ఎన్నో రెట్లు ఎక్కువగా బిల్లు పంపారని ఫైర్ అయ్యారు. 
 
రెండు నెలలకు పైగా రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మీటరు రీడింగులో తప్పులు దొర్లాయని విద్యుత్ శాఖాధికారి తెలిపారు. ప్రసన్న ఇంటికి పంపిన బిల్లును సరిచేసి మళ్లీ పంపిస్తామని విద్యుత్ బోర్డు అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments