Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నైపై కరోనా పంజా - ద్విచక్రవాహనాలపై 'డబుల్స్' ప్రయాణం నిషేధం

చెన్నైపై కరోనా పంజా - ద్విచక్రవాహనాలపై 'డబుల్స్' ప్రయాణం నిషేధం
, గురువారం, 4 జూన్ 2020 (08:47 IST)
చెన్నై మహానగరంపై కరోనా వైరస్ పంజా విసిరింది. ఫలితంగా ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇది ప్రభుత్వంతోపాటు ఇటు చెన్నై నగర వాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అదేసమయంలో చెన్నైతో పాటు దాని పొరుగు జిల్లాలైన తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లోనూ లాక్డౌన్ ఈ నెలాఖరు వరకు పొడగించారు. అంతేకాకుండా, లాక్డౌన్ ఆంక్షలను గురువారం నుంచి మరింత కఠినతరం చేశారు. ద్విచక్రవాహనాలపై ఇద్దరు ప్రయాణించడాన్ని నిషేధించారు. అలా ప్రయాణించినచ పక్షంలో రూ.500 మేరకు అపరాధం విధించనున్నారు. 
 
రాజధాని నగరం చెన్నైలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు పయనించేందుకు నిషేధం విధించారు. డబుల్స్‌తో చక్కర్లు కొడితే రూ. 500 జరిమానా విధించనున్నారు. అలాగే, కార్లు, ఆటోల్లో ఓవర్‌ లోడింగ్‌పై దృష్టి పెట్టనున్నారు. ఇక లాక్‌డౌన్‌కాలంలోనూ రాష్ట్రంలో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 
 
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా మార్చి 24వ తేదీ అర్థరాత్రి నుంచి లాక్డౌన్ అమల్లోవుంది. ప్రస్తుతం ఐదో విడత లాక్డౌన్ ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. అయితే, కరోనా పాజిటివ్ కేసులు లేని ప్రాంతాల్లో లాక్డౌన్ సడలింపులు ఇచ్చేశారు. కానీ, చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో మాత్రం వీటిని మరింత కఠినతరం చేశారు. 
 
దీనికి కారణం దేశలో కరోనా హాట్‌స్పాట్‌లుగా ఉన్న నగరాల్లో చెన్నై ఒకటి. ఇక్కడ కేసులు అమాంతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అధికారులకు టెన్షన్‌ తప్పడం లేదు. పైగా సడలింపు పుణ్యమాని, రోడ్ల మీద వాహనాలు కిక్కిరిసి ఉన్నాయి. అందుకే ట్రాఫిక్ ఆంక్షలపై మరింత దృష్టిపెట్టారు. 
 
డబుల్స్, త్రిబుల్స్‌ అంటూ ద్విచక్ర వాహనాలపై వెళ్లే వాళ్లు రోడ్లపై ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాగే, కార్లలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు, ఆటోల్లో డ్రైవర్‌తో పాటు ఇద్దరు పయనించేందుకు అవకాశం కల్పించినా, అంతకన్నా ఎక్కువగానే అనేక చోట్ల ప్రయాణిస్తున్నారు. ఇలా ఎక్కువమందితో పయనిస్తున్న వాహనాల భరతం పట్టేందుకు గురువారం నుంచి పోలీసులు దూకుడు పెంచనున్నారు.
 
ద్విచక్ర వాహనల్లో ఒకరు మాత్రమే పయనించాలన్న ఆంక్షను విధించారు. డబుల్స్‌తో ఎవరైనా రోడ్డెక్కిన పక్షంలో వారికి రూ.500 జరిమానా విధించనున్నారు. అలాగే, కార్లు, ఆటోల్లో అధిక శాతం మంది ఉంటే, సంఖ్యను బట్టి తలా రూ.500 జరిమానా వడ్డించబోతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలిక స్నానం చేస్తుండగా వీడియో.. వాటిని చూపి గర్భవతిని చేశాడు.. ఎక్కడ?