Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

కరోనా కష్టకాలంలో భారత్‌ను నిలబెడుతున్న ఐదు రాష్ట్రాలు!

Advertiesment
Lockdown
, బుధవారం, 3 జూన్ 2020 (13:40 IST)
కరోనా వైరస్ దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. దేశం మొత్తం లాక్డౌన్‌లోకి వెళ్లడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. ఇపుడు గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. అయితే, లాక్డౌన్ సమయంలో మందగించిన ఆర్థిక వ్యవస్థను తిరిగి కోలుకునేలా చేయడంలో ఐదు రాష్ట్రాలు అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నాయి. దేశ జీడీపీలో ఈ ఐదు రాష్ట్రాలదే అధిక వాటా. 
 
తాజాగా ఎలరా సెక్యురిటీస్ అనే అధ్యయన సంస్థ జరిపిన ఓ సర్వేలో దేశ జీడీపీలో కేరళ, పంజాబ్, తమిళనాడు, హర్యానా, కర్నాటక రాష్ట్రాల వాటా 27 శాతంగా ఉంది. విద్యుత్ వినియోగం, రవాణా, వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లకు చేరుకోవడం వంటి అంశాల్లో ఈ రాష్ట్రాలు ముందున్నాయని పేర్కొంది. 
 
ఇదే అంశంపై ఎలరా సెక్యురిటీస్ ఆర్థికవేత్త గరిమా కపూర్ మాట్లాడుతూ, దేశంలో పారిశ్రామికంగా ముందుండే మహారాష్ట్ర, గుజరాత్ మాత్రం ఇంకా వేగం పుంజుకోలేదని, దీనికి కారణం అమలవుతున్న కఠని ఆంక్షలే దీనికి కారణమని చెప్పారు. దేశ వ్యాపంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నప్పటికీ ఈ వృద్ధి విస్తారంగా కాకుండా అక్కడక్కడా మాత్రమే నమోదవుతోందని గుర్తుచేశారు. 
 
పరిస్థితి సాధారణ స్థితికి రావడం ద్వారానే దేశ ఆర్థికి స్థితికి కావాల్సి ఉత్తేజం లభిస్తుందన్నారు. లాక్డౌన్ కారణంగా దేశంలో వస్తువుల డిమాండ్ పెరిగిపోయిందని, ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో ఏసీలు, బైకులు, వాషింగ్ మెషీన్లు, వ్యాక్యూమ్ క్లీనర్ల డిమాండ్ పెరుగుతుందని స్పష్టం చేశారు. భవిషత్తలులో డిమాండ్ కొనసాగుతుంది అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో కరోనా వైరస్ ఉత్పాతం తప్పదా?