సూర్య నటిస్తున్న తాజా తమిళ సినిమా తెలుగులో కరుప్పు పేరుతో రాబోతుంది. నేడు సూర్య పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను కొద్దిసేపటి కిత్రమే విడుదల చేశారు. ఇందులో సూర్య పూర్తిగా మాస్ అవతార్‌లో కనిపించాడు. నల్ల చొక్కా, లుంగీ ధరించి, తన లుక్‌కు పాతకాలపు గ్రామీణ ఆకర్షణను తిరిగి తీసుకువస్తాడు. కరుప్పు అంటే తెలుగులో నలుపు అని అర్థం.
టీజర్ పరిశీలిస్తే, కర్పూరం వెలిగించి హారతి ఇస్తే శాంతించే దేవుడుకాదు. మనసులో మొక్కకుని మిరపకాయలు దంచితే రుద్రుడై దిగివచ్చే దేవుడు కాలభైర.. అంటూ కరుప్పు టీజర్ ప్రారంభమవుతోంది. ఫుల్ యాక్షన్ తోకూడిన ఈ టీజర్ లో సూర్య పోరాటల సన్నివేశాలతో కత్తులు, కటారులతో ఊరిలో కాలభైరవ దేవుడి జాతరలో వచ్చే సన్నివేశంగా వుంది. ఫుల్ ఫ్యాన్స్ కు యాక్షన్ విందుగా వుంటుంది.
ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా టీజర్ కనిపిస్తుంది. లాయర్ గెటప్ లో సిగార్ వెలిగించుకూంటూ స్టయిల్ గా వస్తూ.. కోర్టులో మాట్లాడుతూ.. నా పేరు సూర్య, నాకింకో పేరుంది..అంటూ టీజర్ కట్ చేశారు. ఆ తర్వాత కత్తులు, కటారులతో యాక్షన్ సీన్స్ కనిపిస్తుంది. ఆ తర్వాత అరే భాయ్.. ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా..అంటూ సవాల్ విసిరే డైలాగ్ తో సూర్య సక్సెస్ కొడతాడనే గ్యారంటీ ఇస్తున్నట్లుంది. ఇలా సాగిన ఈ టీజర్ సూర్య పుట్టినరోజు సందర్భంగా నేడు విడుదల చేశారు.
త్రిష కథానాయికగా నటించింది. నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజా తమిళ సంగీత దర్శకుడు సాయి అభ్యాంకర్ సౌండ్‌ట్రాక్‌ను అందిస్తున్నారు.