Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

దేవీ
శనివారం, 5 జులై 2025 (16:41 IST)
Tarun Bhaskar, Isha Rebba
దర్శకుడు తరుణ్ భాస్కర్ నటుడిగా లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తోంది. రూరల్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఎ ఆర్ సజీవ్ దర్శకత్వం వహిస్తున్నారు. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మిస్తున్నారు. కిషోర్ జలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ జాయింట్ ప్రొడక్షన్.
 
షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. 2D యానిమేషన్ స్టయిల్ లో ప్రజెంట్ చేసిన కాన్సెప్ట్ వీడియోతో పాటు ఆకట్టుకునే టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో మేకర్స్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ పోస్టర్ గొడవ పడుతున్న జంట చేతులను చూపించడం ఆసక్తికరంగా వుంది.  'ఓం శాంతి శాంతి శాంతిః 'అనే టైటిల్ విజువల్స్‌లో చూపించిన గొడవకు ఫన్ యాడ్ చేసింది.
 
కాన్సెప్ట్ వీడియోలో ఈషాను కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయిగా, తరుణ్‌ను వ్యాన్ యజమాని అంబటి ఓంకార్ నాయుడుగా పరిచయం చేశారు. వారి పెళ్లి తర్వాత కథ మలుపు తిరుగుతుంది. ఇద్దరి మధ్య వాగ్వాదాలు, గొడవలు పందెంకోళ్ల తలపించేట్టుగా చూపించారు.
 
జై క్రిష్ మ్యూజిక్ రూరల్ చార్మ్ ని మరింతగా ఎలివేట్ చేసింది. దీపక్ యెరగర సినిమాటోగ్రఫర్. ఈ చిత్రం హ్యుమర్, కల్చర్, రిలేషన్షిప్ డ్రామాతో అందరినీ అలరించబోతోంది.  
ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.
 
తారాగణం: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్, శివన్నారాయణ(అమృతం అప్పాజీ), బిందు చంద్రమౌళి, ధీరజ్ ఆత్రేయ, అన్ష్వీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments