Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

Advertiesment
ENE Repeat poster

దేవీ

, సోమవారం, 30 జూన్ 2025 (09:12 IST)
ENE Repeat poster
'ఈ నగరానికి ఏమైంది' సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని, ముఖ్యంగా యువతను ఆకట్టుకుని సంచలనాత్మక విజయం సాధించి కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. సినిమా రీరిలిజ్ మరింత ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేసింది. సినిమాలో పాత్రలు, హ్యుమర్, లైఫ్ కి కనెక్ట్ అయ్యే కథతో ఈ చిత్రం మ్యాసీవ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇప్పుడు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ అధికారికంగా అనౌన్స్‌ చేశారు. ENE రిపీట్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మళ్ళీ అదరగొట్టబోతోందనే హామీ ఇస్తోంది. దాదాపు ఒరిజినల్ స్టార్ కాస్ట్, టెక్నికల్ టీం తో తిరిగి వస్తున్న ఈ సీక్వెల్ నోస్టాల్జియా ఫీలింగ్ ని కలిగిస్తుంది.  
 
ఫస్ట్ పార్ట్ లో అందరినీ అలరించిన గ్యాంగ్ విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను మరోసారి మ్యాడ్‌నెస్ క్రియేట్ చేయబోతున్నారు. ఒరిజినల్ ని క్రియేట్ చేసిన క్రియేటివ్ పవర్ హౌస్ తరుణ్ భాస్కర్ ఈ సీక్వెల్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై డి. సురేష్ బాబు, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మిస్తున్నారు.
 
టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా ఒక హిలేరియస్ ట్రీట్ లా వుంది. ఈ మూవీ టైటిల్ ENE రిపీట్. ఇది మరో యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ని ప్రామిస్ చేస్తోంది. టైటిల్ లోగో తెలుగు లెటర్స్ ని తెలివిగా మిక్స్ చేస్తోంది. ఇక్కడ ENE యొక్క మొదటి, చివరి అక్షరాలు తెలుగులో కనిపిస్తాయి, చివరి అక్షరాలు తిప్పబడి మూవీ ఆఫ్‌బీట్ టోన్‌ను ప్రజెంట్ చేస్తున్నాయి. ఏలనాటి శని పోయింది, కన్యారాశి టైమ్ ఒచ్చింది అనే ట్యాగ్‌లైన్, గాలిలో ఎగిరిపోతున్న బట్టలు, బ్రీఫ్‌కేస్, బీర్ బాటిళ్లు, సన్ గ్లాసెస్, విమాన టికెట్ ఇవన్నీ ఆకాశమంత సాహసాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి. ఇది కేవలం కొనసాగింపునే కాదు, మ్యాడ్ నెస్ ని మరింత పెంచుతుంది. ఎంటర్ టైన్మెంట్, ఎనర్జీని రెట్టింపు చేస్తుందని హామీ ఇస్తుంది.
 
ఈ సీక్వెల్ ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఒరిజినల్ కంపోజర్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తు సిరీస్ సిగ్నేచర్ వైబ్‌ను కొనసాగిస్తున్నారు. AJ ఆరోన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, రవితేజ గిరిజాల ఎడిటర్. సౌమిత్రి ఎన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు