అర్జున్, సర్కార్ రెండు షేడ్స్ వున్న పాత్రలను నాని హిట్ 3 ట్రైలర్ లో చూపించాడు. 9నెలల పాప కిడ్నాప్ అయితే ఏంచేస్తారుసార్.. అంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చి తల్లి ఫిర్యాదు చేస్తుంది. ఆ తర్వాత పోలీసుగా అర్జున్ ఏమి చేశాడనే పాయింట్ తో హిట్ 3 ట్రైలర్ చూపించారు. హీరో కేరెక్టర్ బిల్డప్ కోసం ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు టీవీలో చెప్పే డైలాగ్ లతో హీరో ఇంట్రడెక్షన్ అవుతుంది.
ఆపదలోవున్నవాడికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్నో అహోరాత్రులు కష్టపడతాడో ఆయనకు మాత్రమే తెలుస్తుంది... అంటూ చాగంటిగారి ప్రవచనం రావడం.. హీరో విలన్లపై కత్తులతో కసకసా నరకడం. యాక్షన్, హింస హైరేంజ్ లో వుంటుంది. అయితే దీనికి పలువురు సోషల్ మీడియాలో చాగంటి గారు ఎందుకు ఇలా చెప్పారంటూ కామెంట్ చేస్తున్నారు. చాగంటి సనాతన ధర్మం, ఆధ్యాత్మిక విలువలను ప్రోత్సహించడంలో ప్రసిద్ధి చెందారని పరిగణనలోకి తీసుకుంటే ఊహించని హింసతో ఇలాంటి ఆధ్యాత్మిక వ్యక్తి ఇంత గ్రాఫిక్‌గా ఏదైనా గొంతు వినిపించిన మొదటి తెలుగు ట్రైలర్ ఇదే కావచ్చు.
అయితే ముందుగానే హింస ఎక్కువగా వుంటుందని చాగంటికి చెప్పారా? లేదా? అనే పాయింట్ తలెత్తింది. దాంతో ఈ విషయం ఆయన ద్రుష్టికి కొందరు తీసుకువెల్ళారు. తాను హింసను ప్రేరేపించమని చెప్పలేదనీ, ఆపదలో వుంటే యోధుడు రంగంలోకి వస్తాడని మాత్రమే అన్నానని చెప్పినట్లు తెలుస్తోంది. కనుక దర్శకుడు చాగంటికి సినిమా కంటెంట్, హింసాత్మక స్వరాన్ని పూర్తిగా వివరించారా? లేదా? అనేది కూడా వినిపిస్తోంది.
హిట్ సిరీస్ యొక్క ఈ మూడవ భాగంలో నాని చెడుతో పోరాడుతున్న పోలీసు పాత్రను పోషిస్తున్నాడు. మునుపటి భాగాలలో, విశ్వక్ సేన్, అడివి శేష్ చట్టం అమలు చేసే పాత్రలను పోషించారు. ఈసారి, దర్శకుడు శైలేష్ కొలను మలయాళం మార్కో, హాలీవుడ్ జాన్ విక్, బాలీవుడ్ కిల్ వంటి హింసాత్మక చిత్రాల నుండి ప్రేరణ పొందినట్లుగా కనిపిస్తోంది. ఇంత క్రూరమైన హింసకు చెందిన ఈ సినిమా ప్రేక్షకులు ఏవిధంగా ఆదరిస్తారో చూడాలి.