Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సందీప్ రెడ్డి వంగా ఆవిష్కరించిన సంతాన ప్రాప్తిరస్తు టీజర్

Advertiesment
Sandeep Reddy Vanga launched Santana Praptirastu Teaser

దేవి

, బుధవారం, 5 మార్చి 2025 (14:31 IST)
Sandeep Reddy Vanga launched Santana Praptirastu Teaser
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా "ఏబీసీడీ" సినిమా, రాజ్ తరుణ్ తో "అహ నా పెళ్లంట" అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు.

యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్ ను స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేశారు.
 
"సంతాన ప్రాప్తిరస్తు" సినిమా టీజర్ చూసి సందీప్ రెడ్డి వంగా  హిలేరియస్ గా ఎంజాయ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం సందీప్ రెడ్డిని ఎంటర్ టైన్ చేసింది. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా టీజర్ చూసిన సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ -  టీజర్ ప్రామిసింగ్ గా ఉంది, "సంతాన ప్రాప్తిరస్తు" మంచి ఎంటర్ టైనింగ్ మూవీలా అనిపిస్తోంది. అన్ని సీన్స్ నవ్వించాయి. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
 
"సంతాన ప్రాప్తిరస్తు" సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే - సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసే హీరో విక్రాంత్ మీద వర్క్ ప్రెజర్ ఎక్కువే ఉంటుంది. సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో యూత్ లైఫ్ కు విక్రాంత్ ఒక ఎగ్జాంపుల్ గా కనిపిస్తాడు. అందమైన అమ్మాయి కల్యాణి( చాందినీ చౌదరి)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కల్యాణి తండ్రికి ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం ఉండదు. విక్రాంత్ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం ఈ కొత్త జంట పేరెంట్స్ కాలేకపోతారు. స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు వైద్యుల సలహాలు, డైట్ ఫాలో అవుతూ వంద రోజుల్లో తన భార్యను ప్రెగ్నెంట్ చేయాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు హీరో.  ఈ ప్రయత్నంలో తను సక్సెస్ అయ్యాడా లేదా అనేది టీజర్ లో ఆసక్తి కలిగించింది. ఫన్, ఎమోషన్ తో పాటు నేటితరం యూత్ ఎదుర్కొంటున్న 'కన్సీవ్' సమస్యను అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా కన్విన్సింగ్ గా ఈ మూవీలో చూపించినట్లు టీజర్ తో తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆడియన్స్ థియేటర్స్ కి రారనే భయం లేదు : నిర్మాత దిల్ రాజు